నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ప్రసార భారతి దూరదర్శన్ న్యూస్ (DD News)లో పూర్తి సమయం కాంట్రాక్ట్ ప్రాతిపదికన వీడియోగ్రాఫర్‌గా పనిచేయడానికి ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్మత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో అప్లికేషన్లను సమర్పించాల్సి ఉంటుంది. అయితే.. ఎంపికైన అబ్యర్థులు న్యూఢిల్లీలో పని చేయాల్సి ఉంటుందని ప్రకటనలో పేర్కొన్నారు. ఈ రిక్రూట్‌మెంట్ ప్రక్రియ ద్వారా మొత్తం 41 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏప్రిల్ 18న ఈ ప్రకటనను prasarbharat.org వెబ్ సైట్లో ప్రచురించారు. ప్రకటన ప్రకటన ప్రచురణ నుంచి 15 రోజులలోపు తమ ఫారమ్‌ను సమర్పించాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు.
దూరదర్శన్ రిక్రూట్‌మెంట్ కోసం భర్తీ చేయాల్సిన పోస్టుల సంఖ్యదూరదర్శన్ భారతి ద్వారా మొత్తం 41 పోస్టులు భర్తీ చేయబడతాయి.దూరదర్శన్ భారతి కింద అందుకున్న జీతం:
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు జీతం ₹ 40,000 జీతం ఇవ్వబడుతుంది. ఉద్యోగ వ్యవధి రెండేళ్లు.గుర్తింపు పొందిన బోర్డు నుంచి 12వ తరగతి అలాగే గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ఇన్‌స్టిట్యూట్ నుంచి సినిమాటోగ్రఫీ లేదా వీడియోగ్రఫీలో డిగ్రీ/డిప్లొమా చేసి ఉండాలి. MOJO అనుభవం కూడా ఉండి.. షార్ట్ ఫిల్మ్ మేకింగ్ కోర్సుకు హాజరైన వారికి ప్రాధాన్యం ఉంటుంది.
0 comments:
Post a Comment