తెలంగాణ ఇంటర్ బోర్డు( Inter Board ) వెబ్‌సైట్‌లో విద్యార్థుల హాల్ టికెట్లు( Hall Tickets ) అప్‌లోడ్ చేసినట్లు బోర్డు అధికారులు వెల్లడించారు. హాల్ టికెట్లలో తప్పులుంటే విద్యార్థులు సరి చేసుకోవాలని సూచించారు. హాల్ టికెట్‌పై ప్రిన్సిపల్ సంతకం లేకున్నా పరీక్షకు అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు.
హాల్ టికెట్ల కోసం www.tsbie.cgg.gov.in అనే వెబ్‌సైట్‌ను సందర్శించొచ్చు. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షలు మార్చి 15 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు కొనసాగనున్నాయి.
0 comments:
Post a Comment