Prakasam Dt Recruitment | ప్రకాశం జిల్లాలో స్పెషల్ డ్రైవ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 2022-23 సంవత్సరానికి విభిన్న ప్రతిభావంతులు (దివ్యాంగులు) కొరకు డి.యస్.సి. పరిధిలో గ్రూప్-4 సర్వీసులో కేటాయించబడి భర్తీ కాకుండా ఖాళీగా ఉన్న టైపిస్ట్ , టెక్నికల్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్/ డి.ఈ.ఓ-1, మరియు, మరియు నాస్-డి.యస్.సి పరిధిలో నాల్గవ తరగతి సర్వీసు నందు ఆఫీసు సబార్డినేటు, కాపలాదారు, సీవిక, స్వీపర్ మరియు కామాటి మొదలయిన ఉద్యోగముల నిల్వ ఖాళీల భర్తీ కొరకు విడివిడిగా ధరఖాస్తులు కోరబడుచున్నవి. జిల్లా లోని ఖాళీల వివరములు:-
అభ్యర్ధులు గమనించ వలసిన ముఖ్యమైన సూచనలు:-

1.ధరఖాస్తు చేసే అభ్యర్థి కనీస వయస్సు తేది:-01.07.2022 నాటికి 18+ సంవత్సరములు నిండి ఉండవలెను, అలాగే గరిష్ట. వయసు 52 (42-10) సంవత్సరములు దాటి ఉండరాదు. 

2.AP G.O.Ms.No. 31 Women Development Child & Disabled Welfare Department, తేది. 01-12-2009, సదరం వైద్య ధ్రువీకరణ పత్రం ప్రకారం శారీరక చలన/దృష్టి లోపం, మేధో వైకల్యం/అటిజం మానసిక అనారోగ్యం/ నిర్దిష్ట అభ్యాస వైకల్యం/బహుళ వైకల్యం గల దివ్యాంగులైతే కనీస వైకల్యం 40 శాతం మరియు బధిర మూగ, చెవుడు దివ్యాంగులు ఐతే కనీస వైకల్యం 
75 శాతము కలిగి వుండాలి. 

3.జిల్లా వెబ్ సైట్ https://prakasam.ap.gov.in/notice_category/recruitment/ నందు గల ఆన్ లైన్ దరఖాస్తు ఫారం లో అన్ని కాలమ్స్ పూరించి సంబంధిత ధృవీకరణ పత్రాలు ఆన్ లైన్ లో జత పరచి ఆ యొక్క దరఖాస్తు ప్రతిని, సహాయ సంచాలకులు, విభిన్న ప్రతిభావంతులు మరియు వయో వృద్ధులు సంక్షేమ శాఖ కార్యాలయానికి అభ్యర్థి నిర్ణీత సమయములో ధరఖాస్తుతో పాటు 1, సదరం వైద్య ధ్రువీకరణ పత్రము 2. విధ్యార్హత ధ్రువీకరణ పత్రములు 3. ఎంప్లాయిమెంట్ కార్డు 4, 4వ తరగతి నుండి 10 వ తరగతి వరకు స్టడీ సర్టిఫికేట్ 5. స్థిర నివాస ధ్రువీకరణ పత్రములు 6. పాస్ పోర్ట్ సైజు ఫోటో మరియు 2 ఎన్వలప్ కవర్లు మొదలగు వాటి ప్రతులను గెజిటెడ్ అధికారిచే అటెస్ట్ చేయించి | పూర్తి చేసిన దరఖాస్తును తేది: 04-2023 సాయంత్రం 05.00 గంటల లోగా స్వయంగా ప్రతినిధి, మరియు పోస్టల్ ద్వారా కాని వచ్చి ధరఖాస్తును సమర్పించగలరు. పోస్టల్ వారి జాప్యముకు ఈ కార్యాలయము బాద్యత వహించదు. 
ప్రభుత్వ ఉత్తర్వులు జి.ఓ.యం.యస్.నం.31. స్త్రీ. శిసు మరియు దివ్యాంగుల సంక్షేమ శాఖ, తేది: 01-12-2009,
జి.ఓ.యం.ఎస్.నెం.23, స్త్రీ, శిసు మరియు దివ్యాంగులు సంక్షేమ శాఖ, తేది: 26-05-2011 జి.ఓ.యం.యస్. నం.99, టి.ఎ.డి(సర్వీసులు) శాఖ, తేది: 04-03-2013 మరియు జి.ఓ.యం.యస్.నం. 2. స్త్రీ, శిసు మరియు దివ్యాంగులు సంక్షేమ శాఖ, 

4.తేది: 19-02-2020 ప్రకారం, అంధులు, బధిరులు మరియు శారీరక అంగవైకల్యము గల వారికి రిజర్వు చేయబడిన టైపిస్ట్ పోస్టులు మరియు ఇతర పోస్టులు ప్రకటించ బడి, గత నియామక ప్రక్రియ లో అర్హులైన అభ్యర్ధులు లేని సందర్భములో ప్రస్తుత నోటిఫికేషన్లో అదే విభాగం వారికి పోస్టులు ప్రకటించ బడును. ఈ నియామక ప్రక్రియ లో అర్హులైన అభ్యర్ధులు లేని చో సదరు ఖాళీలను తదుపరి విభాగముల వారికి పూర్తిగా కాని పాక్షికముగా బదిలీ చేయ బడును.

5.జి.ఓ.నెం.2 స్త్రీ, శిశు మరియు దివ్యాంగులు సంక్షేమ శాఖ, తేది: 19-02-2020 ప్రకారం, మహిళలకు పోస్టులు అర్హులైన అభ్యర్ధులు లేని చో అదే విభాగంలో గల పురుష అభ్యర్ధులకు ప్రాధాన్యత కల్పించ బడును. ప్రకటించ బడిన

6.ఒక అభ్యర్థి ఒకటికన్నా ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేయదలచినచో ప్రతి పోస్టునకు విడి విడి గా ధరఖాస్తు చేయవలెను. 

7.ఏ పోస్ట్ కు ఎంపికైన అభ్యర్థి అయిన అట్టి ఉద్యోగమునకు సంబంధించిన విధులు తానే ఖచ్చితముగా నిర్వర్తించవలసి ఉంటుంది. విధి నిర్వహణలో వైకల్యం కారణము చూపి విధులు నిర్వహించలేను అనరాదు. ఎంపిక ప్రక్రియ రోజే అభ్యర్ధి అట్టి ధృవీకరణ పత్రము కమిటీ వారికి అందచేయాలి. ఏ ప్రకటించిన అభ్యర్థి తిరస్కరణకు గురైతే మెరిట్ లిస్టులోని తర్వాత అభ్యర్ధిని పరిగణలోకి తీసుకోబడుతుంది.

అర్హత లేని మరియు అసంపూర్తి ధరఖాస్తులపై ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరములు చేయబడవు. గ్రూప్-IV ఉద్యోగాల నియామక ప్రక్రియ విధానం: డిగ్రీ లోని మెరిట్ మార్కులు ప్రకారం అనుసరించి మెరిట్ లిస్టు స్థానాలలో

వున్న అభ్యర్థులకు యస్.ఐ.సి., ఒంగోలు వారి ద్వారా టెస్ట్ నిర్వహించబడును. వారికి కంప్యూటర్ నందు ప్రావీణ్యం లేనట్లయితే మెరిట్ లిస్టు లోని తదుపరి అభ్యర్థికి అవకాశం ఇవ్వబడుతుంది. ఆయా పరీక్షలలో ఉత్తీర్ణులైన వారికి మెరిట్ ప్రకారం టైపిస్ట్

మరియు టెక్నికల్ అసిస్టెంట్ నియామకాలు జరుగుతాయి.

| క్లాస్-IV ఉద్యోగాల నియామక ప్రక్రియ విధానం:- జిల్లా కలెక్టర్ గారి ఆదేశాలు మెరకు ఎంపిక ప్రక్రియ నిర్ణయించ బడును.

మరియు అభ్యర్ధుల వయస్సు : 20 మార్కులు, వికలాంగత్వ శాతం: 20 మార్కులు, ఎంప్లాయిమెంట్ సీనియారిటీ: 10 మార్కులు చొప్పున వెయిట్ ఏజ్ ఇవ్వబడును. * కనీస విద్యార్హత/ సాంకేతిక విద్యార్హతలకు సంబందించిన మార్కులు ధృవీకరణ పత్రములు తప్పనిసరిగా ధరకాస్తుతో జత పరచవలెను.

దృవీకరణ పత్రములు జత చేయని అభ్యర్ధులు యొక్క దరఖాస్తులును తిరస్కరించ బడును మరియు జత చేసిన పత్రములు

నకలు స్పష్టముగా కనపడే విధంగా జత పర్చవలెను.

ఈ ప్రకటనలోని ఉద్యోగాల సంఖ్య తగ్గవచ్చు లేదా పెరగవచ్చు మరియు మార్పులు చేర్పులు లేదా ప్రకటనను పూర్తిగా రద్దు పరచే అధికారము జిల్లా కలెక్టర్ వారికి మాత్రమే కలదు. నోటిఫికేషన్ లో విడుదల చేయబడిన టైపిస్ట్ పోస్టులు, సాంకేతిక పోస్టులుకు పూర్తీ అర్హత కలిగి మరియు సంబంధిత కోర్సులు 
నందు గుర్తింపు బోర్డు నుండి ఉత్తీర్ణత పత్రములు కలిగి ఉండవలెను. ఏ కారణం చేతనైన సంబంధిత కోర్సు నందు అసంపూర్ణ మరియు పూర్తి చేయు నటువంటి వారి దరఖాస్తును పరిగణన లోనికి తీస్కోనబడును, మరియు కండిషనల్ నియామకాలు చేయబడువు.

అంధులకు టైపిస్ట్ పోస్టులకు సాంకేతిక బోర్డు నుండి పొందినటు వంటి టైపు పత్రములు లేని యెడల National Institute for Alleennai / Dehradun సంస్థ నుండి పొందినటువంటి టైపు పత్రములు కలిగిన చో వారి అర్హత మేరకు పరిగణనలోకి తీస్కోన బడును.

ప్రకాశం జిల్లాకు చెందిన అభ్యర్ధులు మాత్రమే దరఖాస్తుకు చేసుకోనటకు అర్హులు. ప్రభుత్వ ఉత్తర్వులు సంఖ్య 104 తేది: 24.3.2000, సాధారణ పరిపాలన యస్.పి.ఎఫ్. ఎ ప్రకారం అంధులు మరియు బధిరుల స్థానిక నివాసము నిర్ణయించబడును.

అభ్యర్థులు సమర్పించిన సర్టిఫికేట్ లు ఏ కారణం చేతనైన నకిలీ సర్టిఫికేట్ అని గుర్తించినచో వారి పై చట్టరీత్యా క్రిమినల్ చర్యలు. తీసుకొనబడును. పూర్తి సమాచారము కొరకు అవసరమైన చో కార్యాలయపు పని వేళలో 10.A.M నుండి 5.P.M. పని దినములలో ఫోన్ నెంబర్ కు 085922-281310 ఫోన్ చేయవచ్చు...

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 2022-23 సంవత్సరానికి విభిన్న ప్రతిభావంతులు (దివ్యాంగులు) కొరకు డి.యస్.సి. పరిధిలో గ్రూప్-4 సర్వీసులో కేటాయించబడి భర్తీ కాకుండా ఖాళీగా ఉన్న (అంధులు, టైపిస్ట్- మహిళ-1) (బధిరులు టెక్నికల్ అసిస్టెంట్-1, జూనియర్ అసిస్టెంట్/ డి.ఈ.ఓ-1, టైపిస్ట్: 1) మరియు, మరియు నాస్- డి.యస్.సి పరిధిలో నాల్గవ తరగతి సర్వీసు నందు ((అంధులు ఆఫీసు సబార్డినేటు: జనరల్ 2, కాపలాదారు: మహిళ:2, సేవిక: మహిళ : 1, మహిళ స్వీపర్: 1), (బదిరులు ఆఫీసు సబార్డినేటు: జనరల్: 2) ( శారీరక అంగ వైకల్యం: జనరల్ ఆఫీసు సబార్డినేటు: 2, కామాటి: జనరల్ 1) ( మేధో వైకల్యం, ఆటిసం, మానసిక అనారోగ్యం/ నిర్దిష్ట అభ్యాస వైకల్యం/ బహుళ వైకల్యం: జనరల్ ఆఫీసు సబార్డినేటు:2 )) మొదలయిన ఉద్యోగముల నిల్వ ఖాళీల భర్తీ కొరకు విడివిడిగా ధరఖాస్తులు కోరబడుచున్నవి. ప్రకాశం జిల్లా వెబ్ సైట్ http://www.prakasam.gov.in వెబ్ సైట్ లో నోటిఫికేషన్ ను పొందు పరచడమైనది, మరియు ఆన్ లైన్ ధరకాస్తు వెబ్ సైట్ లో పొందిన రోజు నుండి 15 రోజులు గడువు లోపల ఈ కార్యాలయమునకు ధరకాస్తు చేస్కొని, ఈ కార్యాలయమునకు సమర్పించ వలెను, ఆన్ లైన్ ధరకాస్తు జిల్లా వెబ్ సైట్ లో పొందు పరిచిన వెంటనే పత్రిక ముఖముగా తెలియజేయగలము అని శాఖ సహాయ సంచాలకులు శ్రీమతి జి. అర్చన గారు ఒక్క ప్రకటనలో తెలియజేసియున్నారు.



Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Job Related Material

More

Bank Jobs

More
Top