టెక్నికల్ డిగ్రీ పూర్తి చేసిన వారికి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగం పొందే సదవకాశం. న్యూఢిల్లీలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ- నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ.. సైంటిఫిక్, టెక్నికల్ పోస్టులను భర్తీ చేస్తోంది. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 598 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* వీటిలో సైంటిస్ట్-బి (71), సైంటిఫిక్ ఆఫీసర్/ ఇంజినీర్ (196), సైంటిఫిక్ టెక్నికల్ అసిస్టెంట్ (331) ఖాళీలు ఉన్నాయి.
విద్యార్హత:
పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టుల ఆధారంగా సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంఎస్సీ, ఎంసీఏ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత విభాగంలో పని అనుభవం ఉండాలి.
వయస్సు
* అభ్యర్థుల వయసు 30 ఏళ్లు మించకూడదు.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
అభ్యర్థులను ఎంపిక చేసే విధానం:
* అభ్యర్థులను రాత పరీక్ష, ఇంటర్వ్యూ, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
* ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ 04-03-2023న మొదలై 04-04-2023తో ముగియనుంది
Complete Notification: Click Here
0 comments:
Post a Comment