ఏపీలో పలు ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదలయ్యాయి. ఇంజినీరింగ్, ఫార్మసీ ప్రవేశాలకు నిర్వహించే ఏపీ ఈఏపీ సెట్-2023 పరీక్ష తేదీలను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. మే 15 నుంచి 18 వరకు ఇంజినీరింగ్.. మే 22, 23 తేదీల్లో ఫార్మసీ పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటనలో పేర్కొంది. ఈఏపీసెట్ దరఖాస్తుకు ఈనెల 11 నుంచి ఏప్రిల్ 15 వరకు గడువు ఇచ్చింది. అలాగే మే 5న ఈసెట్ నిర్వహించనుండగా.. దరఖాస్తుకు మార్చి 10 నుంచి ఏప్రిల్ 10 వరకు అవకాశం కల్పించింది. మే 24, 25న ఐసెట్ పరీక్షలు జరపగా.. దరఖాస్తుకు మార్చి 20 నుంచి ఏప్రిల్ 19 వరకు గడువు ఇచ్చింది.
వివిధ రకాల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగ నోటిఫికేషన్ కోసం క్రింది వాట్సాప్ గ్రూపు మరియు టెలిగ్రామ్ గ్రూపులో చేరండి
టెలిగ్రామ్ గ్రూప్ లింకు:
0 comments:
Post a Comment