విశాఖపట్నం జిల్లాలో గల ఐ.సి.డి.యస్ ప్రాజెక్టుల పరిదిలో ఖాళీగా వున్నటువంటి దిగవ
తెలుపబడిన మరియు జతపరచబడిన జాబితాల యందు పేర్కొనబడిన పోస్టుల భర్తీ కొరకు అమలులో
యున్న ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారము ఎంపిక ప్రక్రియ నిర్వహించబడును.
ఖాళీల సంఖ్య
అంగన్వాడీ కార్యకర్త (AWW):05
అంగన్వాడీ సహాయకురాలు (AWH): 42
పోస్టులకు అవసరమైన అర్హతలు దిగువ తెలుపబడినవి.
1. ప్రధానముగా స్థానిక స్దిరానివాసం కలిగిన వివాహిత స్త్రీ అభ్యర్ధి
2. అభ్యర్థి తప్పనిసరిగా 10వ తరగతి ఉత్తీర్ణత చెంది ఉండాలి.. 3. తేది 01.07.2022 నాటికి నియామక సంవత్సరం) 21 సంవత్సరములు నిండి 35 సంవత్సరములు లోపు వయస్సు కలిగి ఉండవలెను.
4. SC / ST లకు రోస్టర్ కేటాయించిన అంగన్వాడి కేంద్రములలో 21 సంవత్సరములు నిండిన అభ్యర్థులు.
లభ్యము కానప్పుడు మాత్రమే 18 సంవత్సరములు నిండిన అభ్యర్ధుల ధరఖాస్తులను పరిశీలించబడును. (G.O Ms. No. 38. WDCW & DW (ICDS )Dept., Dated 03.11.2008).
5. అంగన్వాడీ కార్యకర్త, మిని అంగన్వాడీ కార్యకర్త మరియు ఆయా పోస్టుల ఖాళీ ఉన్న అంగన్వాడీ
కేంద్రములు మరియు వాటికి కేటాయించి రోస్టర్ వివరములు సంబంధిత ఐ.సి.డియస్ ఫ్రోజెక్ట్కా ర్యాలయములో లభించును.
6. కావున పైన ఉదహరించిన అర్హతలు మరియు ప్రాధాన్యతలు కలిగిన స్త్రీ అభ్యర్థినిలు వారి పూర్తి
వివరములతో నివాస, కుల, విద్యార్హత మరియు వివాహ మొదలగు ధృవీకరణ పాత్రముల నకళ్ళు గెజిటెడ్ అధికారిచే అట్టి స్టేషన్ చేయించిన తమ దరఖాస్తులను సంబంధిత శిశు అభివృద్ధి పధకపు అధికారి కార్యాలయం నకు నేరుగాగాని / పోస్టు ద్వారా గాని తేదీ25-03-2023 నుండి 03-04-2023 సాయంత్రం 5.00 గంటలు లోగా అందజేయవలెను.
7. గడువు తర్వాత వచ్చిన దరఖాస్తులు తిరస్కరించబడును.
8. నిర్దేశించిన అర్హతలు మరుయు ప్రాధాన్యతలు సంభందించిన దృవీకరణ పత్రములు జతపర్చిని
దరఖాస్థులు అర్హత కొరకు పరిశీలించబడవు.
9. G.O.Ms. No. 18, WDCW&DW (ICDS) Dept., dated 15.05.2015 ప్రకారం అంగన్వాడీ కార్యకర్త మిని
అంగన్వాడీ కార్యకర్త / / ఆయా పోస్టుల నియామక విధానము.
కావున అభ్యర్ధులు పై తెలుపబడిన 1 నుండి 5 పారా మెటర్లకు సంబంధించిన పూర్తి సమాచారమును దరఖాస్తు ఫారం యందు ఖచ్చితంగా నమోదు చేసి వాటికి సంబంధి ంచిన దృవీకరణ పత్రములు నకలులు మరియు పై తెలుపబడిన అన్నీ అర్హతలు తదితరములకు సంబంధి ంచిన దృవీకరణ పత్రములు నకలులు
ఏదైన గజిటెడ్ అధికారి చే సంతకం గావింపబడిన నకలులు దరఖాస్తునకు ఖచ్చితంగా జతపరుచవలయును.
అట్లు జతపరచని యెడల వాటికి సంబంధించిన సమాచారమును పరిగణలోనికి తీసుకొనబడదు. తెలుపబడిన ఖాళీల భర్తీ యందు ప్రభుత్వ నిబ దనల ప్రకారము ఐ.సి.డి.యస్ ప్రాజెక్టు ఒక యూనిట్ గా పరిగణిస్తూ రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు చేయబడుతుంది. జతపరచబడిన జాబితాల యందు పోస్టునకు అర్హులు, మరియు సదరు కేటగిరినకు సంబంధి ంచిన నిర్దేశిత అధికారి వారిచే జారీ చేయబడిన, నిబందనల ప్రకారం వ్యలిడిటి కలిగిన దృవీకరణ పత్రములు నకలులు దరఖాస్తునకు ఖచ్చితంగా జతపరుచవలయును (SC/ST/BC/EWS/Minor Locomotor disability / disabled కేటగిరిణకు చెందిన వారు మాత్రమే). అట్లు జతపరచని యెడల వాటికి సంబంధి ౦చిన సమాచారమును పరిగణలోనికి తీసునబడదు మరియు అట్టి దరఖాస్తుల invalid గా పరిగణిచబడును (ఓ.సి.కేటగిరి క్రింద కేటాయించబడిన పోస్టులకు పై అర్హతలు కలిగివున్న ఎవరినైనను దరఖాస్తు చేసుకొనవచ్చును.
అభ్యర్ధుల ఎంపిక అంగన్వాడీ కేంద్రము వున్న గ్రామమును స్థానికతకు ప్రాతిపదికగా తీసుకొనుట జరుగును. మునిసిపాలిటీలలో వార్డు ను స్థానికతకు ప్రాతిపదికగా తీసుకొనుట జరుగును. కావున అభ్యర్ధులు వారి స్థానికతకు సంబంధించి పూర్తి సమాచారమును దరఖాస్తు ఫారం యందు నిర్దేశిత కాలమ్ లో పొందుపరిచి వాటి దృవీకరణ పత్రములు అనగా ఆధార కార్డ్ / రేషన్ కార్డ్ / వోటర్ కార్డ్ / మీ సేవ ద్వారా జారీ చేయబడిన దృవీకరణ పత్రములు విధిగా దరఖాస్తునకు జతపరుచవలయును. అట్లు జతపరచని ఏడల వారి దరఖాస్తు పరిగణలోనికి తీసుకొనబడదు.
ప్రభుత్వము వారి మెమో సంఖ్య WDCO1/1481061/2020/Prog-lI/A1 తేది: 25.08.2021 ప్రకారం మినీ అంగన్వాడీ వర్కర్ల ఎంపికలో వికలాంగులకు రిసర్వేషన్ నియమం పిల్లల భద్రత పూర్తిగా మినహాయించబడుటయినది. అంగన్వాడీ కార్యకర్తలు మరియు సహాయకురాలు సంబంధి మంచి రోస్టర్ కేటాయించిన వైఖల్యం ఉన్న అర్హత గల అభ్యర్ధి లేకుంటే, వికలాంగులు కాకుండా ఇతరు అర్హత గల అభ్యర్ధుల లతో నిపబడుడును.
అంగన్వాడీ కార్యకర్త మరియు అంగన్వాడీ హెల్పర్ నియామకము పూర్తిగా తాత్కాలికము మరియు పోస్టులకు నియామకమగు అభ్యర్ధిలకు ప్రభుత్వం నిబందనల ప్రకారం గౌరవ వేతనము మాత్రమే
అర్హత పొందన అభ్యర్ధులకు జిల్లా స్థాయి ఎంపిక కమిటీ నిర్వహిం చే మౌఖిక పరీక్ష తేదీ మ రియు స్థలం తరువాత తెలియజేయబడును.అర్హత కలిగిన కలిగిన అభ్యర్ధులు నిర్ణయించిన తేదీలలో హాజరవ్వవలసిందిగా తెలియజేయడమైనది. దరఖాస్తు చేయగోరు అభ్యర్ధులు తమ పూర్తి బయోడేటా తో పై తెలుపబడిన విధముగా వారి అర్హతలకు సంబందించిన అన్నీ దృవీకరణ పత్రములను ఏదేన గజిటెడ్ అధికారి చే సంతకం చేయించి, వాటిని సంబంధిత శిశు అభివృద్ధి పధక అధికారి కార్యాలయము (ఐ.సి.డి.యస్. ప్రాజెక్టు కార్యాలయం) యందు సమర్పించి తగు రశీదు పొందవలయును. ఈ ప్రకటనను ఎటువంటి కారణములు లేకనే రద్దు పరచుటకుగాని మరియు వాయిదా వేయుటకుగాని లేక మార్పులు చేర్పులు చేయుటకుగాని జిల్లా కలెక్టర్ & అద్యక్షులు, జిల్లా మహిళా & శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి వారి కార్యాలయం, విశాఖపట్నం జిల్లా వారికి సర్వహక్కులు కలవు.
ఈ నోటిఫికేషన్ మరియు దరఖాస్తు ఫారం ను https://visakhapatnam.ap.gov.in/ వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకొనగలరు
దరఖాస్తు చేసుకొనుటకు ఆఖరు తేదీ: 03-04-2023.
Whatsapp Group:
Telegram Group:
0 comments:
Post a Comment