ఢిల్లీలోని ఏఏఐ కార్గో లాజిస్టిక్స్ అండ్ అలైడ్ సర్వీసెస్ కంపెనీ లిమిటెడ్ మూడేళ్ల కాలవ్యవధికి ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన సెక్యూరిటీ స్క్రీనర్ పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.ఏదైనా డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. రాతపరీక్ష, గ్రూప్ డిస్కషన్, సర్టిఫికేట్ల పరిశీలన ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు. మార్చి 19 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
వివరాలు..
సెక్యూరిటీ స్క్రీనర్(ఫ్రెషర్): 400 పోస్టులు
అర్హత:కనీసం 60 శాతం మార్కులతో ఏదైనా విభాగంలో డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 55 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది.
వయోపరిమితి: 19.03.2023 నాటికి 27 సంవత్సరాలకు మించకూడదు. నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, ఎక్స్-సర్వీస్మెన్ అభ్యర్థులకు 5 సంవత్సరాలపాటు వయోసడలింపు వర్తిస్తుంది.
దరఖాస్తు విధానం:ఆన్లైన్ ద్వారా.
దరఖాస్తు రుసుము: రూ.750 (ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది).
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటరాక్షన్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆధారంగా.
వేతనం:నెలకు రూ.30,000-రూ.34,000.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరితేదీ: 19.03.2023.
పూర్తి నోటిఫికేషన్: Click Here
Official Website: Click Here
వివిధ రకాల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగ నోటిఫికేషన్ కోసం క్రింది వాట్సాప్ గ్రూపు మరియు టెలిగ్రామ్ గ్రూపులో చేరండి
టెలిగ్రామ్ గ్రూప్ లింకు:
0 comments:
Post a Comment