UPSC Recruitment: యూపీఎస్‌సీ నుంచి మరో నోటిఫికేషన్‌.. డిగ్రీ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.

UPSC పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. కేంద్ర విభాగాల్లో వివిధ విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు.

నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 73 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎవరు అర్హులు.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 73 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో అసిస్టెంట్ కంట్రోలర్ ఆఫ్ మైన్స్ (47), లేబర్ ఆఫీసర్ (లేబర్ డిపార్టుమెంట్ ) (01), ఫోర్‌మాన్ (ఏరోనాటికల్/ కెమికల్/ కంప్యూటర్ ఐటీ/ ఎలక్ట్రికల్ / మెటలర్జీ /టేక్స్ టైల్ ) (13), డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ (12) ఖాళీలను భర్తీ చేయనున్నారు.

పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేషన్‌తో పాటు, పోస్టు గ్రాడ్యుయేషన్‌, డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. దీంతో పాటు సంబంధిత విభాగంలో పని అనుభవం ఉండాలి.

* అసిస్టెంట్ కంట్రోలర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 35 ఏళ్లు, లేబర్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 33 ఏళ్లు, ఫోర్‌మాన్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 30 ఏళ్లు, డిప్యూటీ డైరెక్టర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 40 ఏళ్లు మించకూడదు.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీగా 02-023-2023ని నిర్ణయించారు.


వివిధ రకాల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ లు కావలసినవారు క్రింది వాట్స్అప్ గ్రూప్ లో చేరండి:

https://chat.whatsapp.com/Gl6mF0Epk2333fRY68PScG

Job Notifications Telegram Group:

https://t.me/apjobs9

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top