SECL Recruitment 2023 : ప్రభుత్వ సంస్థలో 405 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల.. ఈ అర్హతలుంటే చాలు

SECL Recruitment 2023 : మినీరత్న కంపెనీ సౌత్‌ ఈస్టర్న్‌ కోల్‌ఫీల్డ్స్‌ లిమిటెడ్‌ (ఎస్‌ఈసీఎల్‌) సంస్థ తాజాగా మైనింగ్‌ సర్దార్, డిప్యూటీ సర్వేయర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 405 పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం 405 ఉద్యోగాల్లో మైనింగ్‌ సర్దార్, టెక్నికల్‌ అండ్‌ సూపర్‌వైజరీ గ్రేడ్‌-సి 350 పోస్టులు ఉన్నాయి. వీటిల్లో ఎస్సీలకు 48, ఎస్టీలకు 97, ఓబీసీ (ఎన్‌సీఎల్‌)కు 42, ఈడబ్ల్యూఎస్‌కు 32, అన్‌రిజర్వుడ్‌కు 131 కేటాయించారు. డిప్యూటీ సర్వేయర్, టెక్నికల్‌ అండ్‌ సూపర్‌వైజరీ గ్రేడ్‌ - సి పోస్టులు 55 ఉన్నాయి.

ముఖ్య సమాచారం:

అర్హతలు: మైనింగ్‌ సర్దార్‌ పోస్టుకు మెట్రిక్యులేషన్‌/తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. మైనింగ్‌ సర్దార్‌షిప్‌ సర్టిఫికెట్‌ ఆఫ్‌ కాంపిటెన్సీ, ఫస్ట్‌ఎయిడ్‌ అండ్‌ గ్యాస్‌ టెస్టింగ్‌ సర్టిఫికెట్‌ ఉండాలి. లేదా మెట్రిక్యులేషన్‌/తత్సమాన పరీక్ష పాసై మూడేళ్ల మైనింగ్‌ ఇంజినీరింగ్‌ డిప్లొమా చేసి ఉండాలి. ఓవర్‌మేన్‌ సర్టిఫికెట్‌ ఆఫ్‌ కాంపిటెన్సీ, ఫస్ట్‌ ఎయిడ్‌ అండ్‌ గ్యాస్‌ టెస్టింగ్‌ సర్టిఫికెట్‌ ఉండాలి. అలాగే.. డిప్యూటీ సర్వేయర్‌ పోస్టుకు మెట్రిక్యులేషన్‌/తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. ఓపెన్‌ కాస్ట్, అండర్‌గ్రౌండ్‌ కోల్‌మైన్స్‌లో పనిచేసేట్లుగా సర్వే సర్టిఫికెట్‌ ఆఫ్‌ కాంపిటెన్సీ ఉండాలి.

వయసు: 30.01.2023 నాటికి 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. గరిష్ఠ వయసులో ఓబీసీ (ఎన్‌సీఎల్‌) అభ్యర్థులకు 3 ఏళ్లు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్ల మినహాయింపు ఉంటుంది.

ఎంపిక విధానం: ఈ పోస్టులకు సంబంధించి అభ్యర్థులను రాత పరీక్ష, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు ఫీజు: రూ.1180 ఆన్‌లైన్‌లో చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/ఎక్స్‌-సర్వీస్‌మెన్‌/పీడబ్ల్యూడీ/మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు. దరఖాస్తును పూర్తిచేసి, అవసరమైన డాక్యుమెంట్లను అప్‌లోడ్‌ చేసిన తర్వాత దరఖాస్తు ప్రింటవుట్‌ తీసుకోవాలి. సంబంధిత డాక్యుమెంట్లను జతచేసి, ఫొటో అంటించి, సంతకం చేసిన దరఖాస్తును రిజిస్టర్డ్‌/ స్పీడ్‌ పోస్టులో పంపాలి. గవర్నమెంట్‌/ సెమీ గవర్నమెంట్‌/ పీఎస్‌యూల్లో పనిచేస్తోన్న ఉద్యోగులు ‘నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌’ను దరఖాస్తుకు జతచేయాలి.

దరఖాస్తులు పంపాల్సిన చిరునామా: జనరల్‌ మేనేజర్‌ (పీ/ఎంపీ), ఎస్‌ఈసీఎల్, సీపట్‌ రోడ్, బిలాస్‌పూర్‌ (సీజీ) - 495 006.

దరఖాస్తులకు చివరి తేదీ: ఫిబ్రవరి 23, 2023

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: http://www.secl-cil.in/

వివిధ రకాల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ లు కావలసినవారు క్రింది వాట్స్అప్ గ్రూప్ లో చేరండి:


Job Notifications Telegram Group:
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top