కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఆర్‌ఈసీ పవర్ డెవలప్‌మెంట్ అండ్ కన్సల్టెన్సీ లిమిటెడ్ (ఆర్‌ఈసీ పీడీసీఎల్).. 60 ఎగ్జిక్యూటివ్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది.
టెక్నీలజీ, యుటిలిటీ ఇంజినీర్, యూటిలిటీ కోఆర్డినేటర్, పవర్ సిస్టమ్ ఎక్స్‌పర్ట్ తదితర విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఎలక్ట్రికల్/ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్/ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యునికేషన్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ స్పెషలైజేషన్‌లో బీఈ/బీటెక్/ఇంజనీరింగ్ డిగ్రీ/ఎంబీఏ/డిప్లొమా లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. అభ్యర్ధుల వయసు తప్పనిసరిగా 35 నుంచి 45 యేళ్ల మధ్య ఉండాలి.
ఈ అర్హతలున్నవారు ఆన్‌లైన్ విధానంలో ఫిబ్రవరి 27, 2023వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. షార్ట్‌లిస్టింగ్ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేయడం జరుగుతుంది. ఎంపికైన వారికి నెలకు రూ.62,000ల నుంచి రూ.1,12,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
Online Application
వివిధ రకాల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ లు కావలసినవారు క్రింది వాట్స్అప్ గ్రూప్ లో చేరండి:
Job Notifications Telegram Group:
0 comments:
Post a Comment