GAIL Recruitment 2023 : గెయిల్​లో ఎగ్జిక్యూటివ్​ ట్రైనీ పోస్టులు.. ఇలా అప్లై చేసుకోండి

GAIL Recruitment 2023 : ఎగ్జిక్యూటివ్​ ట్రైనీ పోస్టుల అప్లికేషన్లకు ఆహ్వానించింది గెయిల్​ ఇండియా లిమిటెడ్​.

అప్లికేషన్​ ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. ఎగ్జిక్యూటివ్​ ట్రైనీ పోస్టు అప్లికేషన్​కు తుది గడువు మార్చ్​ 15. అభ్యర్థులు గెయిల్​ అధికారిక వెబ్​సైట్​ అయిన gailonline.com లో దరఖాస్తు చేసుకోవచ్చు.

గెయిల్​ లిమిటెడ్​ 2023 ఖాళీల వివరాలు..

ఎగ్జిక్యూటివ్​ ట్రైనీకి సంబంధించి 47 ఖాళీలకు ప్రస్తుతం రిక్రూట్​మెంట్​ జరుగుతోంది. వీటిల్లో 20 పోస్టులు.. ఎగ్జిక్యూటివ్​ ట్రైనీ (కెమికల్​), 11 పోస్టులు ఎగ్జిక్యూటివ్​ ట్రైనీ (సివిల్​), 8 పోస్టులు ఎగ్జిక్యూటివ్​ ట్రైనీ (గెయిల్​టెల్​ టీసీ/టీఎం), మరో 8 పోస్టులు ఎగ్జిక్యూటివ్​ ట్రైనీ (బీఐఎస్​)కు చెందినవి.

GAIL executive trainee post vacancies : గెయిల్​ లిమిటెడ్​ 2023 అర్హత :- గెయిల్​లో ఎగ్జిక్యూటివ్​ ట్రైనీ పోస్టుకు దరఖాస్తు చేస్తున్న అభ్యర్థుల వయస్సు 26ఏళ్లకు మించి ఉండకూడదు.

గెయిల్​ లిమిటెడ్​ 2023- సెలక్షన్​ ప్రక్రియ..

గేట్​ (గ్రాడ్యుయేట్​ ఆప్టిట్యూట్​ టెస్ట్​ ఇన్​ ఇంజినీరింగ్​)- 2023 మార్క్​ల ఆధారంగా ఈ గెయిల్​ ఎగ్జిక్యూటివ్​ ట్రైనీ పోస్టుల ఎంపిక ఉంటుంది. అభ్యర్థులు.. కెమికల్​, సివిల్​, గెయిల్​టెల్​ (టీసీ/టీఎం), బీఐఎస్​ చదివి ఉండాలి.

గెయిల్​ లిమిటెడ్​ 2023- ఇలా అప్లై చేసుకోండి..

GAIL executive trainee posts application process : 

స్టెప్​ 1:- గెయిల్​ అధికారిక వెబ్​సైట్​ gailonline.com కు వెళ్లండి.

స్టెప్​ 2:- హోం పేజ్​లో కెరీర్​ లింక్​ మీద క్లిక్​ చేయండి.

స్టెప్​ 3:- అప్లికేషన్​ ఫామ్​ను రిజిస్టర్​ చేసుకుని ఫిల్​ చేయండి.

స్టెప్​ 4:- సంబంధిత డాక్యుమెంట్లను అప్లోడ్​ చేయండి.

స్టెప్​ 5:- ఫీజు చెల్లించి, ప్రింట్​అవుట్​ తీసుకోండి.
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Job Related Material

More

Bank Jobs

More
Top