భారత సైన్యానికి చెందిన చెన్నైలోని జోన్ రిక్రూటింగ్ ఆఫీస్.. అగ్నిపథ్ పథకం కింద 2023-24 ఏడాది నియామకాలకు సంబంధించి సోల్జర్ టెక్నికల్ నర్సింగ్ అసిస్టెంట్/నర్సింగ్ అసిస్టెంట్ వెటర్నరీ ఎంపికల కోసం అవివాహిత పురుష అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతోంది.ఈ నియామకాలకు ఏపీ, తెలంగాణ, తమిళనాడు, పుదుచ్చేరి తో పాటు అండమాన్ నికోబార్, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
కేటగిరి: సోల్జర్ టెక్నికల్ నర్సింగ్ అసిస్టెంట్/నర్సింగ్ అసిస్టెంట్ వెటర్నరీ పోస్టులు.
వయసు: 17 1/2 నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలి. అక్టోబర్ 1, 2000 నుంచి అక్టోబర్ 1, 2006 మధ్య జన్మించి ఉండాలి.
అర్హత: 10+2/ఇంటర్మీడియట్ సైన్స్ (ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ/బోటనీ,జువాలజీ, ఇంగ్లీష్)లో కనీసం 50 శాతం మార్కులు, ప్రతి సబ్జెక్ట్ లో 40 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. శారీరక ప్రమాణాలుండాలి. ఫిజికల్ మెజర్‌మెంట్స్ (ఏపీ,తెలంగాణ, తమిళనాడు, పుదుచ్చేరి): ఎత్తు 165 సెం.మీ, ఛాతీ గాలి పీల్చినప్పుడు 5 సెం.మీ విస్తరించేలా ఉండాలి.
ఎంపిక: ఆన్‌లైన్ కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష, రిక్రూట్‌మెంట్ ర్యాలీ (ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్), వైద్య పరీక్షలు,ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి.
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: ఫిబ్రవరి 16, 2023.
చివరి తేదీ: మార్చి 15, 2023.
పరీక్ష తేదీ: ఏప్రిల్ 17, 2023.
వెబ్‌సైట్: https://joinindianarmy.nic.in
వివిధ రకాల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ లు కావలసినవారు క్రింది వాట్స్అప్ గ్రూప్ లో చేరండి:
Job Notifications Telegram Group:
0 comments:
Post a Comment