విజయనగరం జిల్లా పరిది లో వస్తుతము 10 అంగన్వాడి కార్యకర్తలు, 44 అంగన్వాడి హెల్పెర్లు మరియు 6 మినీ అంగన్వాడి కార్యకర్తల పోస్టులు ఖాళీలను రూల్ అఫ్ రిజర్వేషన్ ప్రాతిపదికన భర్తీ చేయుట కొరకు అర్హత గల అభ్యర్థల నుండి దరఖాస్తులు కోరబడుచున్నవి. సదరు దరఖాస్తులు తే 10-02-2023 దీ సాయంత్రం 05.00 గంటల లోగా సంబందిత అభివృద్ధి పదకపు అధికారి. ఐ.సి.డి.యస్. ప్రాజెక్ట్ వారి కార్యాలయమునకు నేరుగా గానీ పోస్టు ద్వారా గానీ కార్యాలయ పని దినములలో మాత్రమే అందజేయవలెను. గడువు తర్వాత వచ్చిన దరఖాస్తులు తిరస్కరించబడును. ప్రాజెక్టు వారీ ఖాళీల వివరములు దిగువ పొందుపరచడమైనది.
అంగన్వాడి కార్యకర్త, అంగన్వాడి హెల్చెరు మరియు మినీ అంగన్వాడి కార్యకర్త పోస్టు కొరకు దరఖాస్తు చేయు అభ్యర్థులు ఆ గ్రామ స్థానిక వివాహిత అయి వుండవలెను. రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం సంబదిత ఖాళీల కు కేటాయించిన కేటగిరికి చెందిన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకొనవలెను. వికలాంగులైనచో అతితక్కువ స్థాయి అంగవైకల్యము కలిగిన, అంగన్వాడి కేంద్రములలో ప్రీస్కూల్ అమలు జరపగలిగిన వారిని మాత్రేమే పరిశీలించబడను. సంచాలకులవారి కార్యాలయము, మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ వారి Memo. No. WDCO2-16030/67/2021- ICDS-WD&CW, dt.22-09-2021 అనుసరించి అంగ వైకల్యం ఉన్న అబ్యర్థులు లభించని యెడల సదరు ఖాళీలను ఇతర అభ్యర్థులతో నింపబడును.
వివరాలు:
1. అంగన్వాడీ వర్కర్: 10 పోస్టులు
2. అంగన్వాడీ హెల్పర్: 44 పోస్టులు 3. మినీ అంగన్వాడీ వర్కర్: 06 పోస్టులు
మొత్తం ఖాళీల సంఖ్య: 60 .
అర్హత: పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
వయస్సు: 21 నుంచి 35 సంవత్సరాలు మధ్య
ఉండాలి.
జీతం: నెలకు అంగన్వాడీ వర్కర్కు రూ.11,500; అంగన్వాడీ హెల్పర్/ మినీ అంగన్వాడీ వర్కర్కు
రూ.7000.
ఎంపిక విధానం: పదోతరగతిలో సాధించిన మార్కులు,
ఇంటర్వ్యూ, రూల్ ఆఫ్ రిజర్వేషన్ తదితరాల
ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ దరఖాస్తులను సంబంధిత ఐసీడీఎస్ ప్రాజెక్ట్ కార్యాలయంలో అందజేయాలి.
ఆఫ్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 10-02-2023.
వివిధ రకాల కేంద్రా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ లు కావలసినవారు క్రింది వాట్స్అప్ గ్రూప్లో చేరండి:
Job Notifications Telegram Group:
0 comments:
Post a Comment