తెలంగాణ రాష్ట్రంలో వరుస నోటిఫికేషన్లు విడుదల అవుతున్నాయి. గ్రూప్ 1, 2, 3, 4 ఉద్యోగాలతో పాటు పలు రకాల ఉద్యోగాల భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్లు విడుదల చేసిన సంగతి తెలిసిందే.ఇప్పటికే వీటిలో గ్రూప్ 1కు సంబంధించి ప్రిలిమినరీ పరీక్ష పూర్తి చేశారు. ఈ వారంలో రోజుల్లో ఈ పరీక్ష ఫలితాలు విడుదల కానున్నాయి. ఇక టీఎస్పీఎస్సీ తో పాటు.. ఇతర నియామక సంస్థల నుంచి కూడా తెలంగాణలో పలు ఉద్యోగాలకు నోటిపికేషన్లు వచ్చాయి. వీటితో పాటు.. తెలంగాణలోని పలు జిల్లా కోర్టుల్లో కూడా ఖాళీగా ఉన్న పోస్టులకు నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. తాజాగా 5 నోటిఫికేషన్లకు సంబంధించి హైకోర్టు ఉద్యోగ ప్రకటనలను విడుదల చేసింది. వాటి గురించి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. మొత్తం ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్కు సంబంధించి మొత్తం 139 పోస్టులను ఈ నోటిఫికేషన్ల ద్వారా భర్తీ చేయనున్నారు. వీటితో పాటు జూనియర్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్, ప్రాసెస్ సర్వర్ వంటి పోస్టులు కూడా ఉన్నాయి.
ఎగ్జామినర్ పోస్టుల వివరాల్లోకి వెళ్తే.. దరఖాస్తుల ప్రక్రియ జనవరి 11, 2023 నుంచి ప్రారంభం కానుంది. చివరి తేదీ జనవరి 31, 2023గా నోటిఫికేషన్లో పేర్కొన్నారు.
మార్చిలో పరీక్ష నిర్వహించనున్నారు.
అర్హత..
ఇంటర్మీడియట్ పూర్తి చేసిన వారు ఈ పోస్టులకు అర్హులు. దీంతో పాటు.. తెలుగు భాష వచ్చి ఉండాలి. అభ్యర్థుల యొక్క వయస్సు 18 నుంచి 34 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
రాత పరీక్ష..
100 మార్కులకు రాత పరీక్ష ఉంటుంది. దీనిలో జనరల్ నాలెడ్జ్ నుంచి 60 మార్కులు, జనరల్ ఇంగ్లీష్ నుంచి 40 మార్కులు ఉంటాయి. ఎలంటి నెగెటివ్ మార్కులు ఉండవు. ఇంటర్వ్యూ కూడా లేదు.
ఫీజు..
జనరల్, బీసీ అభ్యర్థులు రూ.600, ఎస్సీ, ఎస్టీ, ఈబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.400 చెల్లించాలి.
మొత్తం 63 ఎగ్జామినర్ పోస్టులకు నోటిఫికేషన్ వెలువడింది. జిల్లాల వారీగా పోస్టుల వివరాలిలా..
భద్రాద్రి కొత్తగూడెం - 3
హైదరాబాద్ సివిల్ కోర్డు- 9
హైదరాబాద్ సిటీ స్మాల్ కోర్టు - 01
హన్మకొండ - 1
జోగలాంబ గద్వాల - 1
జగిత్యాల - 02
జనగాం - 01
భూపాలపల్లి - 02
కామారెడ్డి - 02
అసిఫాబాద్ - 01
మహబూబాబాద్ - 02
మంచిర్యాల - 05
మేడ్చల్ మల్కాజ్ గిరి - 06
ములుగు - 01
నాగర్ కర్నూల్ - 02
నారాయణపేట - 01
పెద్దపల్లి - 01
రాజన్న సిరిసిల్ల - 02
రంగారెడ్డి - 11
సిద్దిపేట - 03
సూర్యాపేట - 02
వికారాబాద్ - 03
వనపర్తి - 01
ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టుల వివరాల్లోకి వెళ్తే.. దరఖాస్తుల ప్రక్రియ జనవరి 11, 2023 నుంచి ప్రారంభం కానుంది. చివరి తేదీ జనవరి 31, 2023గా నోటిఫికేషన్లో పేర్కొన్నారు. మార్చిలో పరీక్ష నిర్వహించనున్నారు.
అర్హత..
డిగ్రీ పూర్తి చేసిన వారు ఈ పోస్టులకు అర్హులు. దీంతో పాటు.. తెలుగు భాష వచ్చి ఉండాలి. అభ్యర్థుల యొక్క వయస్సు 18 నుంచి 34 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
రాత పరీక్ష..
ఫీజు..
మొత్తం 76 ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులకు నోటిఫికేషన్ వెలువడింది. జిల్లాల వారీగా పోస్టుల వివరాలిలా..
భద్రాద్రి కొత్తగూడెం - 05
హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు - 11
హైదరాబాద్ స్పెషల్ కోర్టు - 01
మెట్రో పాలిటిన్ సెషన్ కోర్డు హైదరాబాద్ - 01
జోగలాంబ గద్వాల - 02
జగిత్యాల - 05
భూపాలపల్లి - 04
కామారెడ్డి - 02
అసిఫాబాద్ - 01
మంచిర్యాల - 04
మేడ్చల్ మల్కాజ్ గిరి - 07
ములుగు - 01
నాగర్ కర్నూల్ - 03
నారాయణపేట - 03
పెద్దపల్లి - 02
రాజన్న సిరిసిల్ల - 02
రంగారెడ్డి - 10
సిద్దిపేట - 04
సూర్యాపేట - 03
వికారాబాద్ - 02
వనపర్తి - 01
యాదాద్రి భువనగిరి - 02
పూర్తి వివరాలకు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించొచ్చు. వీటితో పాటు.. జూనియర్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్, ప్రాసెస్ సర్వర్ వంటి విభాగాల్లో ఖాళీ పోస్టులకు నోటిఫికేషన్లన విడుదల చేసింది.
వివిధ రకాల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ కావలసిన క్రింది వాట్స్అప్ గ్రూప్లో చేరండి:
ఉద్యోగ నోటిఫికేషన్ టెలిగ్రామ్ గ్రూపులో చేరండి:
0 comments:
Post a Comment