TCS Smart Hiring 2023 : దేశీయ దిగ్గజ ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS).. భారీస్థాయిలో ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఇటీవల 'స్మార్ట్ హైరింగ్ ప్రోగ్రామ్- 2023'ను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్రోగ్రామ్ ద్వారా భారీ సంఖ్యలో ఫ్రెషర్స్‌ని నియమించుకుంటున్న విషయం కూడా విధితమే. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు జనవరి 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. వివరాల్లోకెళ్తే..
విద్యార్హతలివే:
బీసీఏ, బీఎస్‌సీ (మ్యాథ్స్, స్టాటిస్టిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎలక్ట్రానిక్స్, బయోకెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ), కంప్యూటర్ సైన్స్, ఐటీలో బ్యాచిలర్స్ ఇన్ వొకేషనల్ ఉత్తీర్ణులై ఉండాలి. 2020, 2021, 2022 లో పాసైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ ద్వారా టెన్త్, ఇంటర్మీడియట్ పాస్ అయి, ఫుల్ టైమ్ గ్రాడ్యుయేషన్ కోర్స్ పూర్తి చేసిన అభ్యర్థులు కూడా అప్లయ్ చేసుకోవచ్చు
విద్యార్థులకు టెన్త్, ఇంటర్, డిగ్రీలో 50 శాతం మార్కులు లేదా సీజీపీఏ 5 వస్తే చాలు. 2023 లో డిగ్రీ రాసిన అభ్యర్థులకు ఒక బ్యాక్‌లాగ్ ఉన్నా దరఖాస్తు చేయొచ్చు. టీసీఎస్ స్మార్ట్ హైరింగ్ నియామకాలు పూర్తయ్యేనాటికి బ్యాక్‌లాగ్ క్లియర్ చేయాలి. టీసీఎస్ స్మార్ట్ హైరింగ్ ప్రోగ్రామ్‌లో రాణించిన అభ్యర్థులకు టీసీఎస్ ఇగ్నైట్, టీసీఎస్ యూనిక్ సైన్స్ టు సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామ్‌లో చేరే అవకాశం లభిస్తుంది.
TCS Smart Hiring 2023 - ముఖ్య సమాచారం:
వయసు: అభ్యర్థుల వయసు 18-28 ఏళ్ల మధ్య ఉండాలి.
పని ప్రదేశం: దేశవ్యాప్తంగా ఎక్కడైనా పనిచేయాల్సి ఉంటుంది.
ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.
పరీక్షా విధానం:
టీసీఎస్ స్మార్ట్ హైరింగ్ ప్రోగ్రామ్‌కు అభ్యుర్థులను ఎంపిక చేసేందుకు 50 నిమిషాలు పాటు టెస్ట్ నిర్వహిస్తారు. ఈ టెస్ట్‌లో వర్బల్ ఎబిలిటీ, రీజనింగ్ ఎబిలిటీ, న్యూమరికల్ ఎబిలిటీ నుంచి ప్రశ్నలు ఉంటాయి. ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తే.. నేరుగా ఉద్యోగంలో చేరవచ్చు.
దరఖాస్తులకు చివరితేది: జనవరి 31, 2023
పరీక్ష తేది: ఫిబ్రవరి 10, 2023
ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగ నోటిఫికేషన్ లు కావలసినవారు వాట్సాప్ గ్రూప్ లో చేరండి
https://chat.whatsapp.com/GTiHh2C7QmV4LYcdKOVz3s
https://chat.whatsapp.com/GTiHh2C7QmV4LYcdKOVz3s
పూర్తి వివరాలకు లింక్ ఇదే.. Click Here
అప్లయ్ చేసుకోవడానికి లింక్ ఇదే.. Click Here
Subscribe My Whatsapp & Telegram Groups
0 comments:
Post a Comment