NHB Recruitment: నేషనల్ హౌజింగ్ బ్యాంకులో 36 మేనేజర్, ఆఫీసర్ పోస్టులు - అర్హతలివే!
సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించాలి. జనవరి 14న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. ఫిబ్రవరి 6 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
న్యూఢిల్లీలోని నేషనల్ హౌజింగ్ బ్యాంక్(ఎన్‌హెచ్‌బీ) వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా వివిధ విభాగాల్లో మేనేజర్, ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించాలి. జనవరి 14న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. ఫిబ్రవరి 6 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూలో మెరిట్ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.
వివరాలు...
1) జనరల్ మేనేజర్: 01
2) డిప్యూటీ జనరల్ మేనేజర్: 02
3) అసిస్టెంట్ జనరల్ మేనేజర్: 05
4) రీజినల్ మేనేజర్: 08
5) మేనేజర్: 07
6) డిప్యూటీ మేనేజర్: 10
7) చీఫ్ ఎకనమిస్ట్: 01
8) ప్రొటోకాల్ ఆఫీసర్: 02
విభాగాలు: ప్రాజెక్ట్ ఫైనాన్స్, లీగల్ రికవరీ, కంపెనీ సెక్రటరీ, క్రెడిట్, ఎంఐఎస్, ఎకనమిస్ట్, ఐటీ, లీగల్ & రికవరీ, జనరల్ అడ్మినిస్ట్రేషన్, ప్రొటొకాల్ ఆఫీసర్.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో గ్రాడ్యుయేషన్/ఇంజినీరింగ్ డిగ్రీ/ సీఏ/ ఎంసీఏ/ ఎంబీఏ/ పీజీ డిగ్రీ/ ఎంఫిల్/ పీహెచ్‌డీ ఉత్తీర్ణత.
వయోపరిమితి: 01.01.2023 నాటికి 23-55 సంవత్సరాల మధ్య ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూలో మెరిట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
జీతభత్యాలు: నెలకు రూ.48,170-రూ.1,29,000 చెల్లిస్తారు.
దరఖాస్తు ఫీజు: రూ.850.
ముఖ్యమైన తేదీలు..
➥ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 14.01.2023.
➥ దరఖాస్తు చివరి తేది: 06.02.2023.
Important Links:
ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగ నోటిఫికేషన్ లు కావలసినవారు వాట్సాప్ గ్రూప్ లో చేరండి
Telegram Group: https://t.me/apjobs9
0 comments:
Post a Comment