ఆధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) రాష్ట్రంలోని నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పింది. ఈ నెల 6న మరో జాబ్ మేళా (Job Mela) నిర్వహించనున్నట్లు ప్రకటించింది.
అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా రిజిస్టర్ (Job Registration) చేసుకోవాల్సి ఉంటుంది. ఈ జాబ్ మేళా ద్వారా మొత్తం 100 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఖాళీలు, విద్యార్హతల వివరాలు:
Mohan Spintex India Pvt Ltd:ఈ సంస్థలో Tr.Operators/Helpers విభాగంలో 50 ఖాళీలు ఉన్నాయి. టెన్త్ నుంచి డిగ్రీ చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.8 వేల వరకు వేతనం ఉంటుంది. ఇంకా ఫ్రీ ఫుడ్, వసతి ఉంటుంది. వయస్సు 18-30 ఏళ్లు ఉండాలి.
Schneider Electronics:ఈ సంస్థలో 50 ఖాళీలు ఉన్నాయి. ప్రొడక్షన్ ట్రైనీ విభాగంలో ఈ ఖాళీలు ఉన్నాయి. టెన్త్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారు హైదరాబాద్ లో పని చేయాల్సి ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు రూ.10 వేల నుంచి రూ.13 వేల వరకు వేతనం ఉంటుంది. అయితే.. ఈ ఖాళీలకు కేవలం మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని ప్రకటనలో స్పష్టం చేశారు.
ఇతర వివరాలు:
- అభ్యర్థులు ముందుగా ఈ లింక్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.
- రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులు ఈ నెల 6న ఉదయం 10 గంటలకు APSSDC డిస్ట్రిక్ట్ ఆఫీస్, AIMS ఇంజనీరింగ్ కాలేజీ, ముమ్మిడివరం చిరునామాలో నిర్వహించనున్న ఇంటర్వ్యూలకు హాజరుకావాల్సి ఉంటుంది.
- అభ్యర్థులు ఇతర పూర్తి వివరాలకు 9989910835 నంబర్ ను సంప్రదించాలని ప్రకటనలో పేర్కొన్నారు.
- అభ్యర్థులు ఇంటర్వ్యూలకు హాజరయ్యే సమయంలో ఖచ్చితంగా ఫార్మల్ డ్రస్ తో రావాలని ప్రకటనలో స్పష్టం చేశారు.
వివిధ రకాల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ కావలసిన క్రింది వాట్స్అప్ గ్రూప్లో చేరండి:
ఉద్యోగ నోటిఫికేషన్ టెలిగ్రామ్ గ్రూపులో చేరండి:
0 comments:
Post a Comment