నిరుద్యోగులకు గుడ్ న్యూస్.! ప్రతీ నెలా మూడో వారం ఉద్యోగ నోటిఫికేషన్.. కేంద్రమంత్రి కీలక ప్రకటన

సికింద్రాబాద్‌- విశాఖపట్నం మధ్య వందేభారత్‌ రైలు పరుగులు పెట్టనుంది. మకర సంక్రాంతి రోజునే ప్రధాని నరేంద్రమోదీ వర్చువల్‌గా ఈ రైలును ప్రారంభించనున్నారు.దీంతో దేశంలో 6వ వందేభారత్‌ ట్రైన్‌ పట్టాలెక్కనుంది. దేశవ్యాప్తంగా మొత్తంగా 100 వందే భారత్‌ రైళ్లను ప్రారంభించాలని కేంద్రం నిర్ణయించుకున్నట్టుగా కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి వివరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నిరుద్యోగులకు గొప్ప ఊరటనిచ్చే ప్రకటన చేశారు. ఇకపై ప్రతినెలా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ వెలువడనున్నట్టుగా తెలిపారు. ఈనెల 20న అపాయింట్ మెంట్ లెటర్లు ఇస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.

ఇప్పటికే రెండు దఫాలుగా ఉద్యోగాలను భర్తీ చేశామని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం 10 లక్షల ఉద్యోగ ఖాళీలను గుర్తించినట్టుగా వెల్లడించారు.. ప్రతి నెలా మూడో వారంలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేస్తామన్నారు. ప్రతినెలా లక్ష వరకు ఉద్యోగాలు భర్తీ చేస్తున్నామన్నారు.10లక్షలఉద్యోగాలను భర్తీ చేయడమే లక్ష్యమన్నారు. ఇప్పటికే లక్ష యాభై వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ ఇచ్చామన్నారు. 2023 ఆగస్టు 15లోపు 10 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు.

మరోవైపు ప్రజారోగ్యానికి కేంద్రం ప్రాధాన్యత ఇస్తోందని కిషన్ రెడ్డి అన్నారు. ఆయుష్మాన్ భారత్ పథకం కింద దేశవ్యాప్తంగా లక్షా 50 వేల వెల్ నెస్ సెంటర్లను ఏర్పాటు చేశామన్నారు. వెల్ నెస్ సెంటర్లలో అన్ని రకాల వైద్య సదుపాయాలు కల్పిస్తున్నామని గుర్తు చేశారు. ఇంతకుముందు దేశవ్యాప్తంగా 387 మెడికల్ కాలేజీలు ఉండగా, ఇప్పుడు ఆ సంఖ్య 606కి పెరిగింది. 7 ఎయిమ్స్ ఆసుపత్రులకు బదులుగా ఇప్పుడు 22 అందుబాటులో ఉన్నాయి. 2024లో మరో 9 ఎయిమ్స్‌ ఆస్పత్రులను ప్రజలకు అందుబాటులోకి తెస్తామని కిషన్‌రెడ్డి వెల్లడించారు.

వివిధ రకాల ఉద్యోగం నోటిఫికేషన్ కావలసినవారు క్రింది వాట్స్అప్ గ్రూప్లో చేరండి :https://chat.whatsapp.com/BaRIs4dBlJ19DVYqCZKLsk
ఉద్యోగ నోటిఫికేషన్ టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి:

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top