విశాఖపట్నం జిల్లా రెవెన్యూ శాఖ మరియు ఎన్నికల విభాగములో గల ఔట్ సోర్సింగ్ డేటా ఎంట్రీ ఆపరేటర్స్ ఉద్యోగముల భర్తీ కొరకు అర్హులైన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు ఆహ్వానించడమైనది.
ఉద్యోగము పేరు: డేటా ఎంట్రీ ఆపరేటర్ (ఔట్ సోర్సింగ్)
ఖాళీల సంఖ్య:07
విద్యార్హతలు:
- ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
Computer MS Office నందు డిప్లొమా లేదా పి.జి. డిప్లొమా. ఉత్తీర్ణులై ఉండాలి.
సంబంధిత రంగములో పని అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఇవ్వబడును.
వయస్సు :18 సం.ల నుండి 42 సం. ల వరకు,
(ప్రభుత్వ నిబంధనల ప్రకారము రిజర్వేషన్ కేటగిరి అభ్యర్ధులకు వయోపరిమితి సడలింపు కలదు)
జీతం : రూ. 18,500/- లు (APCOS నిబంధనల మేరకు)
దరఖాస్తు చేయవలసిన చివరి తేది: 19.01.2023 గురువారం, సాయంత్రం 5 గంటల లోపు
కావున ఆసక్తి, అర్హతలు గల అభ్యర్థులు ఈ ప్రకటనతో జత చేయ బడిన దరఖాస్తు నమూనా ప్రకారము
వివరములతో పాటు ఈ క్రింద పేర్కొన్న ధ్రువీకరణ పత్రాల నకళ్ళు జత పరచి తమ దరఖాస్తులను జిల్లా కలక్టరు వారి కార్యాలయములో ప్రత్యేకంగా ఉంచిన బాక్స్ నందు పైన నిర్దారించిన తేదీ మరియు సమయం లోపు వేయవలెను.
1. అర్హతల ధ్రువ పత్రాలు
2. కుల ధ్రువీకరణ పత్రము
3. రేషన్ కార్డు
4. ఆధార్ కార్డు
5.పని అనుభవం ధ్రువ పత్రము
6. ఇతర ధ్రువ పత్రాలు
ఆలస్యముగా అందిన దరఖాస్తులను తిరస్కరించబడును..
అన్ని అర్హతలు గల అభ్యర్ధులకు మాత్రమే ఇంటర్వ్యు తేది మరియు ధ్రువ పత్రాల పరిశీలన తేదీలు విడిగా
తెలియ చేయబడును.
ఈ భర్తీ ప్రక్రియ జిల్లా కలక్టరు వారి అధ్యక్షతన గల APCOS - జిల్లా ఔట్ సోర్సింగ్ కమిటీ, విశాఖపట్నం జిల్లా
వారి ఆధ్వర్యంలో పూర్తిగా పారదర్శకంగా మెరిట్, పని అనుభవం మరియు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రాతిపదికగా జరుగును. కావున అభ్యర్ధులు ఏ విధమైన ప్రలోభాలకు లోను కావద్దని కోరడ మైనది.
ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగ నోటిఫికేషన్ లు కావలసినవారు వాట్సాప్ గ్రూప్ లో చేరండి
https://chat.whatsapp.com/GTiHh2C7QmV4LYcdKOVz3s
https://chat.whatsapp.com/GTiHh2C7QmV4LYcdKOVz3s
పూర్తి నోటిఫికేషన్ మరియు దరఖాస్తు క్రింది లింకు నందు కలవు
0 comments:
Post a Comment