ఆధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) రాష్ట్రంలోని నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఈ నెల 24న మరో జాబ్ మేళా (Job Mela) నిర్వహించనున్నట్లు ప్రకటించింది.
ఈ జాబ్ మేళా ద్వారా ప్రముఖ అపోలో, రిలయన్స్ సంస్థల్లో 220 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా రిజిస్టర్ (APSSDC Job Registration) చేసుకోవాల్సి ఉంటుంది. ఖాళీలు, విద్యార్హతల వివరాలు:
అపోలో: ఈ సంస్థలో 200 ఖాళీలు ఉన్నాయి. ఫార్మసిస్ట్, రిటైల్స్ ట్రైనీ అసోసియేట్ విభాగంలో ఈ ఖాళీలు ఉన్నాయి. టెన్త్, ఇంటర్, డిగ్రీతో పాటు ఎం/బీ/డీ ఫార్మసీ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు వేతనం ఉంటుంది. వేతనంతో పాటు ఇన్సెంటీవ్స్ ఉంటాయి. వయస్సు 19-30 ఏళ్లు ఉండాలి.
రిలయన్స్ స్మార్ట్:ఈ సంస్థలో 20 ఖాళీలు ఉన్నాయి. కస్టమర్ సర్వీస్ అసోసియేట్ విభాగంలో ఈ ఖాళీలు ఉన్నాయి. టెన్త్ నుంచి డిగ్రీ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారు రైల్వే కోడూరులో పని చేయాల్సి ఉంటుంది. వయస్సు 19-30 ఏళ్లు ఉండాలి.
వివిధ రకాల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ లు కావలసినవారు క్రింది వాట్స్అప్ గ్రూప్లో చేరండి
Join Telegram Group: https://t.me/apjobs9
0 comments:
Post a Comment