కంపెనీలన్నీ ఉద్యోగులను తొలగిస్తుంటే.. మరోవైపు జొమాటో (Zomato) మాత్రం భారీ సంఖ్యలో ఉద్యోగాలకు రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ విషయంపై జొమాటో సీఈవో దీపిందర్ గోయెల్ లింక్‌డ్ఇన్(LinkedIn)లో చేసిన ఓ పోస్టు ప్రస్తుతం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. తమ కంపెనీలో వివిధ విభాగాల్లో 800 ఖాళీలు ఉన్నాయని గోయెల్ ప్రకటించడం సంచలనంగా మారింది. మొత్తం ఐదు జాబ్ రోల్స్‌లో ఈ ఖాళీలు ఉన్నాయని గోయెల్ తెలిపారు. ఈ ఐదు జాబ్ ప్రొఫైల్స్‌ను ఆయన షేర్ చేశారు.
ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక అనిశ్చిత పరిస్థితులు నెలకొన్న దృష్ట్యా ముందు జాగ్రత్తగా బడా కంపెనీలు ఖర్చును తగ్గించుకుంటున్నాయి. ఇందులో భాగంగా వేల సంఖ్యలో ఉద్యోగులను తీసేస్తున్నాయి. అనవసరంగా అనిపించిన ఉద్యోగాల్లో కోత పెడుతున్నాయి. అయితే, జొమాటో మాత్రం ఇందుకు విరుద్ధంగా ఉద్యోగ ఖాళీలు ఉన్నట్లు వెల్లడించింది. ఐదు రోల్స్‌కు సంబంధించిన ఖాళీలు, కావాల్సిన నైపుణ్యాలు తదితర వివరాలను వెల్లడిస్తూ సీఈవో దీపిందర్ గోయెల్ పోస్ట్ చేశారు. మరింత సమాచారం కోసం మెయిల్ చేయాలని యూజర్ ఐడీ కూడా ఇచ్చారు. ఖాళీలు ఉన్న ఐదు రోల్స్ గురించి తెలుసుకోవడానికి deepinder@zomato.comకు మెయిల్ చేయాలని సూచించారు
Important Job Notifications:
Indian Army : ఇండియన్ ఆర్మీలో ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ స్కీమ్ కోర్సులో ప్రవేశాలు
వివిధ రకాల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగ నోటిఫికేషన్ లు కావలసినవారు ఈ వాట్సాప్ గ్రూప్ లో చేరండి
https://chat.whatsapp.com/Hu5S9VkL2QLGy9hznC8u9F
Telegram Group: https://t.me/apjobs9
0 comments:
Post a Comment