TS Ration Dealer: తెలంగాణలో రేషన్‌ డీలర్‌ ఉద్యోగాలు, పదోతరగతి పాసైన వారికి అవకాశం! వీరు మాత్రమే అర్హులు!

పదోతరగతి ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సంబంధిత డివిజన్‌లో స్థానికుడై ఉండాలి. అభ్యర్థుల వయసు 18 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉండాలి. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
ఆదిలాబాద్ జిల్లాలో రేషన్ డీలర్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. దీనిద్వారా ఆదిలాబాద్ రెవెన్యూ డివిజన్ పరిధిలో మొత్తం 27 రేషన్ డీలర్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. పదోతరగతి ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సంబంధిత డివిజన్‌లో స్థానికుడై ఉండాలి. అభ్యర్థుల వయసు 18 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉండాలి. అభ్యర్థులు ఆఫ్‌లైన్ విధానంలో తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.  

రేషన్ డీలర్: 27 ఖాళీలు

అర్హత: పదోతరగతి ఉత్తీర్ణతతో పాటు స్థానికత ఉండాలి. ఆపై విద్యార్హత ఉన్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. స్థానికేతరులకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం లేదు. అభ్యర్థులు పుట్టినతేది, విద్యార్హతలు, కులం, పూర్తి చిరునామా, స్థానికతకు సంబంధించిన సర్టిఫికేట్ పత్రాలను దరఖాస్తుతోపాటు సమర్పించాల్సి ఉంటుంది.

వయోపరిమితి: 18 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు నిబంధనల ప్రకారం వయోసడలింపు వర్తిస్తుంది.

దరఖాస్తు ఫీజు: రూ.1000

దరఖాస్తు విధానం: అభ్యర్థులు ఆదిలాబాద్ ఆర్డీవో కార్యాలయంలో రూ.1000 చెల్లించి దరఖాస్తులు పొందాలి. దరఖాస్తులు పూరించి అదే కార్యాలయంలో సమర్పించాల్సి ఉంటుంది.  దరఖాస్తుదారులపై ఎలాంటి క్రిమినల్/సివిల్ కేసులు ఉండకూడు. 

ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. మొత్తం 100 మార్కులకు ఎంపిక ఉంటుంది. ఇందులో రాతపరీక్షకు 80 మార్కులు, ఇంటర్వ్యూకు 20 మార్కులు కేటాయించారు. రాతపరీక్ష అర్హత మార్కులను 32గా నిర్ణయించారు. రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల్లో 1:5 నిష్పత్తిలో ఇంటర్వ్యూకు పిలుస్తారు.

ముఖ్యమైన తేదీలు...

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 21.12.2022.

దరఖాస్తుల సమర్పణకు చివరితేది: 06.01.2023.

రాత పరీక్ష తేది: 22.01.2023.

ఇంటర్వ్యూ తేది: 27.01.2023.

పరీక్ష కేంద్రం: గవర్నమెంట్ మెన్స్ డిగ్రీ కాలేజీ, ఆదిలాబాద్.
Official Website

వివిధ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ లు కావలసినవారు క్రింది వాట్సప్ గ్రూపులో చేరండి:

https://chat.whatsapp.com/JsTuEfIY6B70GU7z1dq081

Telegram Job Notification Link:

https://t.me/apjobs9


Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Job Related Material

More

Bank Jobs

More
Top