ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) రాష్ట్రంలోని నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. ఈ నెల 20న మరో జాబ్ మేళా (Job Mela) నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ATC Tires AP Pvt Ltd, Anatalaxmi Spinning Pvt Ltd సంస్థల్లో ఖాళీల (Jobs) భర్తీకి ఇంటర్వ్యూలను నిర్వహించనున్నట్లు తెలిపింది. మొత్తం 250 ఖాళీలను ఈ ప్రకటన ద్వారా భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా రిజిస్ట్రేషన్ (Job Registration) చేసుకోవాల్సి ఉంటుంది. ATC Tires AP Pvt Ltd: ఈ సంస్థలో 200 ఖాళీలు ఉన్నాయి. ప్రొడక్షన్/క్వాలిటీ విభాగంలో ఈ ఖాళీలు ఉన్నాయి. బీఎస్సీ, టెక్నికల్ అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.15 వేల వేతనం ఉంటుంది. వయస్సు 21-24 ఏళ్లు ఉండాలి. అయితే.. కేవలం మహిళలు మాత్రమే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలని ప్రకటనలో పేర్కొన్నారు. Anatalaxmi Spinning Pvt Ltd: ఈ సంస్థలో 50 ఖాళీలు ఉన్నాయి. మిషన్ ఆపరేటర్స్ విభాగంలో ఈ ఖాళీలు ఉన్నాయి. 5వ తరగతి నుంచి గ్రాడ్యుయేషన్ చేసిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. గుంటూరు జిల్లా బోయపాలెం లో అభ్యర్థులు పని చేయాల్సి ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.8100 వేతనం ఉంటుంది. 19-30 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి.
ఇతర వివరాలు: - అభ్యర్థులు ముందుగా ఈ లింక్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. - రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులు ఈ నెల 20న ఉదయం 10 గంటలకు SKR Degree College (Women), రాజమహేంద్రవరం చిరునామాలో నిర్వహించనున్న ఇంటర్వ్యూలను నిర్వహించనున్నారు. - ఇతర వివరాలకు 6303889174, 9666472877 నంబర్లను సంప్రదించాల్సి ఉంటుంది.
వివిధ రకాల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ కావలసినవారు ఈ క్రింది వాట్సాప్ గ్రూప్ లో చేరండ
0 comments:
Post a Comment