SSC GD Constable 2022 : స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) భారీ జాబ్ నోటిఫికేషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 24,369 జనరల్ డ్యూటీ కానిస్టేబుల్(SSC GD Constable) ఖాళీల కోసం అర్హత, ఆసక్తిగ అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తోంది. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎన్‌సీబీలో సిపాయి పోస్టులకు.. నెలకు రూ. 18,000 నుండి 56,900 మధ్య చెల్లిస్తారు. BSF, CRPF, CISF, ITBP, SSF, SSB, NIA మరియు రైఫిల్‌మెన్ పోస్టులకు రూ. 21,700- 69,100 మధ్య చెల్లిస్తారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు నవంబర్ 30 లోగా https://ssc.nic.in/ వెబ్‌సైట్ ద్వారా అప్లయ్ చేసుకోవాల్సి ఉంటుంది.
3 దశల్లో ఎంపిక ప్రక్రియ:
రాత త పరీక్ష (కంప్యూటర్ ఆధారిత)
ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET)
ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (PST), మెడికల్ టెస్ట్‌లు.SSC GD
Constable 2022 - ఖాళీలు: 24,369
బీఎస్ఎఫ్ (BSF)- 10,497
సీఐఎస్ఎఫ్ (CISF)- 100
సీఆర్పీఎఫ్ (CRPF)- 8911
ఎస్ఎస్‌బీ (SSB)- 1284
ఐటీబీపీ (ITBP)- 1613
ఏఆర్ (AR)- 1697
ఎస్ఎస్ఎఫ్ (SSF)- 103
ఎన్‌సీబీ (NCB)- 164
SSC GD Constable 2022 - ముఖ్య సమాచారం:
అర్హతలు: ఏదైనా గుర్తింపు పొందిన బోర్ట్ నుంచి 10వ తరగతి/మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
పురుష అభ్యర్థుల యొక్క ఎత్తు 170 సె.మీ లకు తగ్గకూడదు. మహిళా అభ్యర్థులకైతే.. 157 సెం.మీలకు తగ్గకూడదు.
వయో పరిమితి: జనవరి 01, 2023 నాటికి 18 నుండి 23 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో అప్లయ్ చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: రూ.100. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్‌సర్వీస్‌మెన్‌కు ఫీజు లేదు.
SSC GD Constable 2022 - ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తులు ప్రారంభం: అక్టోబర్ 27, 2022
దరఖాస్తు ఫారమ్ నింపడానికి చివరి తేదీ: నవంబర్ 30, 2022
ఫీజు చెల్లింపు చేయడానికి చివరి తేదీ: డిసెంబర్ 1, 2022
ఆఫ్‌లైన్ చలాన్ రూపొందించడానికి చివరి తేదీ: నవంబర్ 30, 2022
చలాన్ ద్వారా చెల్లింపుకు చివరి తేదీ: డిసెంబర్ 1, 2022
ఎస్‌ఎస్‌సీ జీడీ పరీక్ష తేదీ: జనవరి 2023
నోటిఫికేషన్ Click Here
0 comments:
Post a Comment