Railway : రాత పరీక్షలేకుండా.. రైల్వేలో 2,521 ఉద్యోగాలు.. 10వ తరగతి పాసై.. ఈ అర్హతలుంటే చాలు..!

RRC WCR Apprentice Recruitment 2022 : భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన వెస్ట్రన్‌ సెంట్రల్‌ రైల్వే (West Central Railway) పరిధిలోని వివిధ యూనిట్లలో.. 2,521 అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ రైల్వే రిక్యూట్‌మెంట్‌ సెల్‌ (RRC) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా కార్పెంటర్‌, కంప్యూటర్‌ ఆపరేటర్‌ కమ్‌ ప్రోగ్రామింగ్‌ అసిస్టెంట్, డ్రాఫ్ట్‌మెన్‌ (సివిల్‌), ఎలక్ట్రీషియన్‌, ఫిట్టర్‌, పెయింటర్‌, ప్లంబర్‌, బ్లాక్‌ స్మీత్‌, వెల్డర్‌ తదితర విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయనున్నారు.ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు లేదా ఇన్‌స్టిట్యూట్‌ నుంచి 10వ తరగతిలో ఉత్తీర్ణతతోపాటు ఇంటర్మీడియట్‌ లేదా లేదా తత్సమాన కోర్సులో కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. నేషనల్‌ ట్రేడ్‌ సర్టిఫికెట్‌ కూడా ఉండాలి. ఇంజనీర్‌ గ్రాడ్యుయేట్లు, డిప్లొమా హోల్డర్లు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అనర్హులు. అభ్యర్ధుల వయసు నవంబర్‌ 17వ తేదీ నాటికి 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్‌ వర్గాలకు వయోపరిమితి విషయంలో సడలింపు వర్తిస్తుంది. ఈ అర్హతలున్న అభ్యర్ధులు ఆన్‌లైన్‌ విధానంలో డిసెంబర్‌ 17వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు సమయంలో జనరల్ అభ్యర్ధులు రూ.100 అప్లికేషన్‌ ఫీజు చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ/మహిళా అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది. షార్ట్‌లిస్టింగ్‌, అకడమిక్‌ మెరిట్‌ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా స్టైపెండ్‌ చెల్లిస్తారు.

మొత్తం ఖాళీలు : 2521
జబల్పూర్ డివిజన్‌లో ఖాళీలు- 884
భోపాల్ డివిజన్‌లో ఖాళీలు- 614
కోట డివిజన్‌లో ఖాళీలు- 685
కోటా వర్క్‌షాప్ డివిజన్‌లో ఖాళీలు- 160
CRWS BPL డివిజన్‌లో ఖాళీలు- 158
హెచ్‌క్యూ/జబల్పూర్ డివిజన్‌లో ఖాళీలు- 20
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Job Related Material

More

Bank Jobs

More
Top