బీఎస్సీ నర్సింగ్ లేదా పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ లేదా డిప్లొమా(జనరల్ నర్సింగ్) అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. దరఖాస్తు ప్రక్రియ నవంబర్ 7న ప్రారంభం అవుతుంది.పుదుచ్చేరిలోని జవహర్‌లాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పోస్టుగ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్(జిప్‌మర్) నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. బీఎస్సీ నర్సింగ్ లేదా పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ లేదా డిప్లొమా(జనరల్ నర్సింగ్) అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. దరఖాస్తు ప్రక్రియ నవంబర్ 7న ప్రారంభం అవుతుంది. సరైన అర్హతలు గల అభ్యర్ధులు డిసెంబర్ 1లోగా దరఖాస్తుచేసుకోవాలి.
వివరాలు..
నర్సింగ్ ఆఫీసర్: 433 పోస్టులు
అర్హతలు: బీఎస్సీ(ఆనర్స్) నర్సింగ్/ బీఎస్సీ నర్సింగ్ లేదా బీఎస్సీ(పోస్ట్- సర్టిఫికేట్)/ పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ లేదా డిప్లొమా(జనరల్ నర్సింగ్ & మిడ్‌వైఫరీ)తో పాటు రెండేళ్ల పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 18 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.
దరఖాస్తు ఫీజు: జనరల్/ఈడభ్ల్యూ అభ్యర్ధులకు రూ.1,500 (ఓబీసీలకు రూ.1,500; ఎస్సీ, ఎస్టీలకు రూ.1,200; దివ్యాంగ అభ్యర్థులకు దరఖాస్తు రుసుము నుంచి మినహాయింపు ఉంటుంది).
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష (కంప్యూటర్ ఆధారిత పరీక్ష), స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
జీత భత్యాలు: నెలకు రూ.44,900.
ముఖ్యమైన తేదీలు..
ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభతేదీ: 07.11.2022.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 01.12.2022.
హాల్ టికెట్ డౌన్‌లోడ్ ప్రారంభం: 10.12.2022.
ఆన్‌లైన్ పరీక్ష తేదీ: 18.12.2022.
Job Notification Whatsapp Group:
Subscribe My Whatsapp & Telegram Groups
0 comments:
Post a Comment