ECIL Techinical Officers Recruitment Notification

హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్) టెక్నికల్‌ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ప్రకటన ద్వారా 190 ఖాళీలను భర్తీ చేయనున్నారు. బీఈ, బీటెక్ అర్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఒప్పంద ప్రాతిపదికన ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. నవంబరు 26, 28, 29 తేదీల్లో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఇంటర్వ్యూలకు హాజరవ్వాల్సి ఉంటుంది.
ముఖ్య వివరాలు:
విభాగాలు: టెక్నికల్ ఆఫీసర్(190 పోస్టులు)

అర్హతలు: బీఈ, బీటెక్ (సీఎస్ఈ/ ఐటీ/ ఈసీఈ/ ఈఈఈ/ ఈ&ఐ/ ఈటీసీ/ ఎలక్ట్రానిక్స్/ మెకానికల్/ ఎలక్ట్రికల్) ఉత్తీర్ణతతోపాటు సంబంధిత రంగంలో ఏడాది పాటు పనిచేసిన అనుభవం ఉండాలి.

జీత భత్యాలు: నెలకు రూ.25,000 నుంచి రూ.31,000 వరకు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: విద్యార్హతలో సాధించిన మార్కులు, సంబంధిత పని అనుభవం, పర్సనల్ ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపిక చేస్తారు.

పనిచేయాల్సిన ప్రదేశాలు: ముంబయి, హైదరాబాద్, నాలియా, బెంగళూరు, కైగా, రావత్భట, కోటా, అలహాబాద్, అండమాన్ & నికోబార్, లఖ్ నవూ, వైజాగ్, యాదాద్రి.

కాంట్రాక్ట్ వ్యవధి: ఏడాది. అవసరాలకు అనుగుణంగా పొడిగించే అవకాశం ఉంది.

ఇంటర్వ్యూలు జరుగు తేదీలు: 26-11-2022, 28-11-2022, 29-11-2022.

ఇంటర్వ్యూలు జరుగు ప్రదేశం: ఫ్యాక్టరీ మెయిన్ గేట్, ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ఈసీఐఎల్, హైదరాబాద్.

Complete Notification
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Job Related Material

More

Bank Jobs

More
Top