APSSDC Recruitment 2022 | ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జాబ్ మేళా
ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) రాష్ట్రంలోని నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పింది. ఈ నెల 11న మరో జాబ్ మేళా (Job Mela) నిర్వహించనున్నట్లు ప్రకటించింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా రిజిస్టర్ (Job Registration) చేసుకోవాల్సి ఉంటుంది. ఈ జాబ్ మేళా ద్వారా 14కు పైగా కంపెనీల్లో దాదాపు 1100 ఉద్యోగాలను ఈ జాబ్ మేళా ద్వారా భర్తీ చేస్తున్నారు. ఖాళీలు విద్యార్హతల వివరాలు: Amara Raja Group: ఈ సంస్థలో 100 ఖాళీలు ఉన్నాయి. మిషన్ ఆపరేటర్ విభాగంలో ఈ ఖాళీలు ఉన్నాయి. టెన్త్, ఇంటర్, ఐటీఐ (పాస్/ఫెయిల్) అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.13,500 గ్రాస్ సాలరీ చెల్లించనున్నారు. Muthoot Group: ఈ సంస్థలో 150కి పైగా ఖాళీలు ఉన్నాయి. పీజీ (ఎంబీఏ/ఎం.కామ్), డిగ్రీ (6 నెలల అనుభవం), డిగ్రీ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.10 వేల నుంచి 20 వేల వరకు వేతనం చెల్లించనున్నారు. Apollo Pharmacy: ఈ సంస్థలో 100 ఖాళీలు ఉన్నాయి. ఫార్మసిస్ట్, రిటైల్ ట్రైనీ అసోసియేట్ విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. ఎం.ఫార్మసీ/బీ.ఫార్మసీ/డీ.ఫార్మసీ చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఐటిఐ చేసిన అభ్యర్థులకు సువర్ణవకాశం.. ఏపీఎస్ఆర్టీసీలో ఉద్యోగాలకు నోటిఫికేషన్.. ఇలా అప్లై చేయండి Blue Star Climatech Limited: ఈ సంస్థలో 200 ఖాళీలు ఉన్నాయి. ఐటీఐ/డిప్లొమా/బీటెక్, ఇంటర్ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.14 వేల వేతనం ఉంటుందని ప్రకటనలో పేర్కొన్నారు. - ఈ సంస్థలతో పాటు మరో 10 సంస్థల్లో ఖాళీలున్నాయి.ఇతర వివరాలు: - అభ్యర్థులు ముందుగా ఈ లింక్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. - రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులు ప్రభుత్వ ఐటీఐ కాలేజ్, పద్మావతిపురం, తిరుచనూర్ రోడ్, తిరుపతి రూరల్, తిరుపతి జిల్లా చిరునామాలో ఈ నెల 11న ఉదయం 9 గంటలకు నిర్వహించనున్న ఇంటర్వ్యూలకు హాజరుకావాల్సి ఉంటుంది.అభ్యర్థులు ఇంటర్వ్యూలకు హాజరయ్యే సమయంలో Resume కాపీలను వెంట తీసుకురావాల్సి ఉంటుంది. - ఇతర పూర్తి వివరాలకు 8121585857, 9966601867 నంబర్లను సంప్రదించాలని సూచించారు.
0 comments:
Post a Comment