ఏపీలోని నిరుద్యోగులకు శుభవార్త ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ (APSSDC&SEEDAP) వారి ఆధ్వర్యంలో 11-11-2022 నాడు ఉదయం 9 గంటలకు నంద్యాల జిల్లా (Nandyal District) ఆత్మకూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మెగా జాబ్ మేళా నిర్వహించబడుతుందని DSDO ప్రతాప్ రెడ్డి తెలిపారు. 10వ తరగతి, ఇంటర్మీడియెట్, డిగ్రీ, ఐటిఐ, డిప్లొమా, ఇంజనీరింగ్ మొదలగు అన్ని రకాల విద్యార్హతలు కలిగిన నిరుద్యోగ యువత ఈ ఉద్యోగ మేళాకుహాజరు కావచ్చన్నారు. జాబ్ మేళాలో అరబిందో ఫార్మా, ఎయిర్ టెల్, జియో మార్ట్, ICICI బ్యాంకు , SBI లైఫ్ లతో సహా దాదాపు 15 ప్రముఖ కంపెనీలు.., ఉద్యోగులను ఎంపిక చేసుకోవడానికి ప్రభుత్వంతో అవగాహన ఏర్పరచుకొని ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నాయి. ఎంపికైన అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణ రాష్ట్రంలో పని చేయాల్సి ఉంటుంది. ఉద్యోగ స్థాయిని బట్టి జీతం రూ.10 వేల నుండి రూ.25వేల వరకు ఉంటుంది. అపోలో ఫార్మసీ జాబ్ రోల్ : ఫార్మాసిస్ట్ విద్యార్హత : ఎం. ఫార్మసీ, బి.ఫార్మసీ, డి. ఫార్మసీ ప్రదేశం : కర్నూలు జెండర్ : పురుషులు/స్త్రీలు వయస్సు : 22 - 30 సంవత్సరాలు ఖాళీల సంఖ్య : 30 వేతనం :- 12 నుంచి 20,000 రూపాయలు నెలకు ఎయిర్‌టెల్ పేమెంట్ బ్యాంక్ జాబ్ రోల్ :- ఫిల్డ్ సెల్స్ ప్రమోటర్ విద్యార్హత :- ఇంటర్ మరియు డిగ్రీ జెండర్ :- పురుషులు వయస్సు :-18 - 27 సంవత్సరాలు ఖాళీల సంఖ్య :- 45 వేతనం :నెలకు 16,275 ఇన్సెంటివ్ 8000 ప్రదేశం :- కర్నూలు మరియు నంద్యాల
జియో మార్ట్ ఉద్యోగ పాత్ర :- కస్టమర్ సర్వీస్ ఆఫీసర్స్ విద్యార్హత :- ఎస్ఎస్సి ఇంటర్ ఏదైనా డిగ్రీ జెండర్ :- పురుషులు వయస్సు :-21 - 28 సంవత్సరాలు ఖాళీల సంఖ్య :- 20 వేతనం :- నెలకు 13,000 నుంచి18,000 ప్రదేశం :- కర్నూలు, నంద్యాల ఉద్యోగం మేళా జరుగు ప్రదేశం: పత్తికొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, సంప్రదించవలసిన నెంబర్లు: 8897694291
ఉద్యోగ మేళాకు హాజరయ్యే నిరుద్యోగులు రెజ్యూమ్, జిరాక్స్ విద్యార్హత పత్రాలు, ఆధార్ కార్డ్ , పాన్ కార్డ్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో తో పాటు ఫార్మల్ డ్రెస్లో రావాల్సి ఉంటుంది.
0 comments:
Post a Comment