గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారా?
ఇంటి నుంచే లక్షల జీతం ఇచ్చే జాబ్ చేయడం మీ కలా.. అయితే ప్రముఖ ఫుడ్ డెలివరీ కంపెనీ జొమాటో (Zomato) మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పింది.
ఈ కంపెనీ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్‌లో ఉత్తీర్ణులైన వారి కోసం జాబ్స్ ప్రకటించింది. కస్టమర్ సపోర్ట్ - చాట్ ప్రాసెస్ (Customer Support - Chat Processing) పోస్టుల కోసం సంస్థ దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ ఉద్యోగాలకు (Jobs) ఎంపికైన వారు దాదాపు రూ.3 లక్షల యాన్యువల్ ప్యాకేజీ అందుకోవచ్చు. జొమాటోలో కస్టమర్ సపోర్ట్ - చాట్ ప్రాసెసింగ్ జాబ్‌కు సెలెక్ట్ అయిన వారు జొమాటో కస్టమర్ల ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే వారి సమస్యలను పరిష్కరించాల్సిన రెస్పాన్సిబిలిటీ వీరిపై ఉంటుంది. ఇలాంటి ప్రొఫైల్ గల జాబ్‌లో చేరాలనే ఆసక్తి ఉన్న అభ్యర్థులు zomato.com/careersలోని అధికారిక వెబ్‌సైట్‌లో జాబ్ డీటెయిల్స్ చెక్ చేయవచ్చు. అయితే ఈ జాబ్‌ను ఆఫీస్‌కి వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇంటి నుంచే చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలంటే అభ్యర్థులకు వారి రెజ్యూమ్ సెండ్ చేయాల్సి ఉంటుంది.
జీతం ఎంత
కస్టమర్ సపోర్ట్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి ఏడాదికి రూ.2,94,000 జీతం లభిస్తుంది. దీనర్థం ఉద్యోగులు నెల నెలా రూ.24,500 పొందవచ్చు. డీసెంట్ శాలరీ ఆఫర్ చేసే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్‌కి ఎలా అప్లై చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఎలా అప్లై చేయాలి
ఎంప్లాయిస్ రెఫరల్ ద్వారా జాబ్ అప్లికేషన్లను అంగీకరిస్తున్నట్లు కంపెనీ స్వయంగా వెల్లడించింది. అంటే జాబ్ కావాలనుకునేవారు జొమాటోలో పనిచేసే ఎంప్లాయిస్ రెఫరల్ ద్వారానే జాయిన్ కావడం సాధ్యమవుతుంది. కంపెనీ కెరీర్ పేజీలోకి వెళ్లి ఈ పోస్ట్ కోసం దరఖాస్తు చేయడం సాధ్యం కాదని అభ్యర్థులు గమనించాలి. ఆసక్తి గల అభ్యర్థులు ఫేస్‌బుక్ లేదా ట్విట్టర్ వంటి సోషల్ మీడియా సైట్స్ ద్వారా జొమాటో ఫుడ్ డెలివరీ యాప్‌లో పనిచేస్తున్న ఉద్యోగులను కనుగొనవచ్చు. వారు కాంటాక్ట్ అయి, వారితో మాట్లాడి జాబ్ రెఫరల్ కోసం రిక్వెస్ట్ చేయొచ్చు. అలా కుదరదని అనుకున్నవారు careerupjob.com లో అకౌంట్ ఓపెన్ చేసి ఈ పోస్ట్‌ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
0 comments:
Post a Comment