Apply for 990 IMD scientific assistant posts, check SSC’s latest notification

SSC Scientific Assistant IMD Notification 2022: భారత వాతావరణ శాఖ (IMD)లో గ్రూప్ బి నాన్-గెజిటెడ్, నాన్-మినిస్టీరియల్ పోస్టులైన సైంటిఫిక్ అసిస్టెంట్ ఖాళీల భర్తీకి సంబంధించి నియామక పరీక్ష నోటిఫికేషన్ను స్టాఫ్ సెలక్షన్ కమీషన్ (SSC) విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 990 సైంటిఫిక్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీని చేపట్టనుంది. ఈ పోస్టుల భర్తీకి ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. అక్టోబర్ 18 దరఖాస్తులకు చివరితేది.

సైంటిఫిక్ అసిస్టెంట్ (ఐఎండీ) నియామక పరీక్ష-2022

మొత్తం ఖాళీలు: 990

అర్హతలు: 10+2 (సైన్స్, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్). బ్యాచిలర్ డిగ్రీ(భౌతికశాస్త్రం/ కంప్యూటర్ సైన్స్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ కంప్యూటర్ అప్లికేషన్స్). లేదా డిప్లొమా(ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణత ఉండాలి.

వయోపరిమితి: 18-10-2022 నాటికి 30 ఏళ్లు మించకూడదు. దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.

దరఖాస్తు ఫీజు: రూ.100.

ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ ఆధారిత పరీక్ష (పార్ట్-1, పార్ట్-2), ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు: చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులు ప్రారంభతేదీ: సెప్టెంబర్ 30, 2022

దరఖాస్తులకు చివరితేది: అక్టోబర్ 18, 2022 

ఆఫ్లైన్ చలానా రూపొందించడానికి చివరి తేది: అక్టోబర్ 19, 2022

ఆన్లైన్ ఫీజు చెల్లింపు చివరి తేది: అక్టోబర్ 20,2022
చలానా ద్వారా ఫీజు చెల్లింపు చివరి తేది: అక్టోబర్
20, 2022

దరఖాస్తులో మార్పులకు అవకాశం: అక్టోబర్ 25, 2022

కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహణ: డిసెంబర్, 2022.


పూర్తి వివరాలకు వెబ్సైట్: https://ssc.nic.in/


Online Application Link: Click Here

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Job Related Material

More

Bank Jobs

More
Top