FCI Assistant Grade 3 Recruitment
2022: భారత ప్రభుత్వ ఆహారం, ప్రజా పంపిణీ,
వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (Food Corporation of India).. 5043 అసిస్టెంట్, జూనియర్ ఇంజనీర్, టైపిస్ట్, స్టెనోగ్రాఫర్ పోస్టుల భర్తీకి (Assistant Grade 3 Posts) అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. నార్త్ జోన్, ఈస్ట్ జోన్, వెస్ట్ జోన్, సౌత్ జోన్, నార్త్ ఈస్ట్ జోన్లలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు.
అర్హతలు:
పోస్టులను బట్టి సంబంధిత స్పెషలైజేషన్లో గ్రాడ్యుయేషన్/బీకాం/ఈఈ/ఎంఈ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే టైపింగ్ స్కిల్స్, ట్రాన్స్ లేషన్ స్కిల్స్, కంప్యూటర్ స్కిల్స్ పాటు సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. దరఖాస్తుదారుల వయసు 21 నుంచి 28 యేళ్ల మధ్య ఉండాలి.
ఈ పోస్టులకు సంబంధించి సెప్టెంబర్ 6వ తేదీ నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుంది. అర్హతలు, ఆసక్తి కలిగిన వారు అక్టోబర్ 5 వ తేదీలోపు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ రాత పరీక్ష/స్కిల్ టెస్ట్/టైపింగ్ టెస్ట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.28,200ల నుంచి రూ. 1,03,400ల వరకు జీతం ఉంటుంది.
రాత పరీక్ష విధానం:
ఈ పరీక్షలో మొత్తం 100 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలకు 100 మార్కులకు గానూ మొత్తం 60 నిముషాల వ్యవధిలో పరీక్ష రాయవల్సి ఉంటుంది. ఇంగ్లిష్ ల్యాంగ్వేజ్, రీజనింగ్ ఎబిలిటీ, న్యూమరికల్ అప్టిట్యూడ్, జనరల్ స్టడీస్ విభాగాల నుంచి ప్రశ్నలుంటాయి. పూర్తి వివరాలకు నోటిఫికేషన్ లేదా https://fci.gov.in/ వెబ్సైట్ చూడొచ్చు.
జోన్లవారీగా ఖాళీలివే:
నార్త్ జోన్ – 2388
సౌత్ జోన్ - 989
ఈస్ట్ జోన్ – 768
వెస్ట్ జోన్ – 713
నార్త్ ఈస్ట్ జోన్ - 185
0 comments:
Post a Comment