ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఉద్యోగాలు
ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) రాష్ట్రంలోని నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పింది. వచ్చే నెల అంటే అక్టోబర్ 4న మరో జాబ్ మేళా (Job Mela) నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ జాబ్ మేళాను అనకాపల్లి జిల్లాలోని అచ్యుతాపురంలో నిర్వహించనున్నారు. ఈ జాబ్ మేళా ద్వారా రెండు ప్రైవేటు సంస్థల్లో దాదాపు 70కి పైగా ఖాళీలను (Jobs) భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా రిజిస్టర్ చేసుకోవాలని ప్రకటనలో పేర్కొన్నారు. ఖాళీలు, విద్యార్హతల వివరాలు: Brandix Apparel India Pvt Ltd: ఈ సంస్థలో గార్మెంట్ టెక్నీషియన్ ఇంటర్న్స్ విభాగంలో 16 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఏదైనా డిగ్రీ, లేదా డిప్లొమా చేసిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులు 2019 నుంచి 2022 మధ్యలో పాసై ఉండాలి. పురుషులు/స్త్రీలు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. వయస్సు 18-25 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఇంటర్న్ షిప్ పిరియడ్ 9 నెలలు ఉంటుంది. ఈ కాలంలో నెలకు రూ.8 వేల చొప్పున స్టైఫండ్ ఉంటుంది. ఎంపికైన వారు అచ్యుతాపురంలో పని చేయాల్సి ఉంటుంది. Teejay India Private Ltd: ఈ సంస్థలో మిషన్ ఆపరేటర్ విభాగంలో 50 ఖాళీలు, స్టాఫ్ విభాగంలో మరో 5 ఖాళీలు ఉన్నాయి. టెన్త్/ఇంటర్, బీఎస్సీ (కెమిస్ట్రీ) విద్యార్హత కలిగిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. అయితే కేవలం పురుషులు మాత్రమే ఈ ఖాళీలకు అప్లై చేసుకోవాలని ప్రకటనలో స్పష్టం చేశారు. ఎంపికైన వారు అచ్యుతాపురంలో పని చేయాల్సి ఉంటుంది.ఇతర వివరాలు: -అభ్యర్థులు ముందుగా ఈ లింక్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. - రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులు అక్టోబర్ 4వ తేదీ ఉదయం 10 గంటలకు Brandix Apparel India Pvt Ltd., Plot No 18, BIACPL SEZ, Pudimadaka Road, Atchutapuram, Anakapalli Dist. చిరునామాలో నిర్వహించనున్న ఇంటర్వ్యూలకు హాజరుకావాల్సి ఉంటుంది.అభ్యర్థులు ఇంటర్వ్యూలకు హాజరయ్యే సమయంలో ఫార్మల్ డ్రెస్ ధరించాల్సి ఉంటుంది. Resume, విద్యార్హతల సర్టిఫికేట్ల కాపీలు, ఆధార్, పాన్, పాస్ పోర్ట్ సైజ్ ఫొటోలు వెంట తీసుకురావాల్సి ఉంటుంది. - ఇతర పూర్తి వివరాలకు 9010793492, 9492429425 నంబర్లను సంప్రదించాలని ప్రకటనలో స్పష్టం చేశారు.
0 comments:
Post a Comment