Nims Job Recruitment : నిజాం ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) లో ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 200 స్టాఫ్ నర్స్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.
అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి బీఎస్సీ నర్సింగ్ తత్సామాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్ధుల వయస్సు 18 నుండి 34 ఏళ్లు మధ్య ఉండాలి. అభ్యర్ధుల ఎంపిక పరీక్ష లో మెరిట్ అధారంగా ఉంటుంది. ఆన్ లైన్ దరఖాస్తులకు చివరి తేదిగా 10 సెప్టెంబర్ 2022ను నిర్ణయించారు. ఆప్ లైన్ లో దరఖాస్తులు పంపేందుకు సెప్టెంబర్ 6, 2022ను చివరి తేదిగా నిర్ణయించారు. ఆప్ లైన్ దరఖాస్తులు పంపాల్సిన చిరుమానా ; ఎగ్జిక్యూటివ్ రిజిస్ట్రార్ , 2వ ఫ్లోర్, ఓల్డ్ ఓపీడీ బ్లాక్, నిమ్స్, హైదరాబాద్ 500082, పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://nims.edu.in/ పరిశీలించగలరు.
0 comments:
Post a Comment