సెంట్రల్ రిక్రూట్‌మెంట్ సెల్ (CRC) AOC సికింద్రాబాద్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్(Notification) విడుదల చేసింది. ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్ AOC సికింద్రాబాద్ రిక్రూట్‌మెంట్ 2022 నోటిఫికేషన్ ద్వారా ట్రేడ్స్‌మన్ మేట్, ఫైర్‌మ్యాన్, జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ (JOA) పోస్టులను భర్తీ చేయనుంది.
సెంట్రల్ రిక్రూట్‌మెంట్ సెల్ (CRC) AOC సికింద్రాబాద్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్(Notification) విడుదల చేసింది. ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్ AOC సికింద్రాబాద్ రిక్రూట్‌మెంట్ 2022 నోటిఫికేషన్ ద్వారా ట్రేడ్స్‌మన్ మేట్, ఫైర్‌మ్యాన్, జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ (JOA) పోస్టులను భర్తీ చేయనుంది. వీటిలో మొత్తం 3068 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అర్హత కలిగిన అభ్యర్థులు అధికారికి వెబ్ సైట్ ను www.aocrecruitment.gov.in సందర్శించడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎవరు అర్హులు, జీతం తదితర వివరాలను ఇక్కడ తెలుసుకుందాం..
ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్ (AOC) ట్రేడ్స్‌మ్యాన్ మేట్, ఫైర్‌మ్యాన్ మరియు మెటీరియల్ అసిస్టెంట్ పోస్టుల కోసం షార్ట్ నోటీసును విడుదల చేసింది. ఈ షార్ట్ నోటీసు 29 ఆగస్టు 2022న జారీ చేయబడింది. పోస్ట్‌ల గురించి సమాచారం అందులో ఇవ్వబడింది. ఆసక్తి మరియు అర్హత కలిగిన అభ్యర్థులు AOC రిక్రూట్‌మెంట్ 2022 కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్ యొక్క అధికారిక వెబ్‌సైట్ www.aocrecruitment.gov.in నుండి దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల యొక్క కనీస వయస్సు 18 సంవత్సరాలు, గరిష్ట వయో పరిమితి 25 సంవత్సరాలు ఉండాలని షార్ట్ నోటీస్ లో పేర్కొన్నారు
ఉత్తీర్ణత.. ట్రేడ్స్ మెన్ మేట్ ఉద్యోగాలకు అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డ్/యూనివర్శిటీ నుండి 10వ / మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణత లేదా తత్సమానం కలిగి ఉండాలి.
ఫైర్ మెన్ ఉద్యోగాలకు.. అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డ్/యూనివర్శిటీ నుండి 10వ / మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణత లేదా తత్సమానం కలిగి ఉండాలి.
జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలకు.. అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు/యూనివర్శిటీ నుండి 12వ ఉత్తీర్ణత లేదా తత్సమానాన్ని కలిగి ఉండాలి. మరిన్ని వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక ప్రక్రియ ఇలా..
1. ఫిజికల్ / ప్రాక్టికల్ / స్కిల్ పరీక్షలు
2.రాత పరీక్ష
3. డాక్యుమెంట్ వెరిఫికేషన్
4.మెడికల్ ఫిట్‌నెస్ టెస్ట్ ద్వారా ఎంపిక
ఫిజికల్ టెస్ట్..
ట్రేడ్స్ మెన్ మేట్ అభ్యర్థులు.. 6 నిమిషాల్లో 1.5 కి.మీ పరుగు, 100 సెకన్లలో 50 కిలోల బరువును 200 మీటర్ల దూరం మోసుకెళ్లాలి. ఇది అర్హత పరీక్ష మాత్రమే.
అగ్నిమాపక సిబ్బంది..
శారీరకంగా దృఢంగా ఉండాలి . కఠినమైన విధులను నిర్వహించగల సామర్థ్యం కలిగి ఉండాలి . దిగువ పేర్కొన్న పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి:
(i) బూట్లు లేకుండా ఎత్తు - 165 సెం.మీ (ఎస్టీ సభ్యులకు 2.5 సెం.మీ.ల సడలింపు ఉంటుంది).
(ii) ఛాతీ -81.5 సెం.మీ.
(iii) ఛాతీ (విస్తరించిన తర్వాత) - 85 సెం.మీ.
(iv) బరువు - 50 కేజీలు
శారీరక దారుఢ్య పరీక్షలో..
(i) 6 నిమిషాల్లో 1.6 కి.మీ పరుగు
(ii) 63.5 కిలోల బరువున్న వ్యక్తిని 96 సెకన్లలోపు 183 మీటర్ల దూరానికి మోసుకెళ్లడం.
(iii) రెండు పాదాలపై 2.5 మీటర్ల వెడల్పు కందకం దిగడం (లాంగ్ జంప్)
(iv) చేతులు మరియు కాళ్లను ఉపయోగించి 3 మీటర్ల నిలువు తాడును ఎక్కడం వంటివి అర్హత సాధించాల్సి ఉంటుంది.
Official Website: Click Here
Short Notification: Click Here
0 comments:
Post a Comment