తెలంగాణలో భారీ జాబ్ మేళా (Job Mela) జరగనుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ యూత్ సర్వీసెస్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ (Telangana) ఇందుకు ఏర్పాట్లు చేస్తోంది ఈ మేరకు సంబంధిత అధికారులు ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 28న హైదరాబాద్ మహానగరానికి అతి సమీపంలోని శంషాబాద్ లో ఈ జాబ్ మేళాను నిర్వహించనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. జాబ్ మేళాను శంషాబాద్ లోని మల్లికా ఏసీ కన్సెన్షన్ లో నిర్వహించనున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా రిజిస్టర్ (Job Registration) చేసుకోవాలని సూచించారు. ఈ జాబ్ మేళాను ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు నిర్వహించనున్నారు.
ఖాళీలు, విద్యార్హతల వివరాలు:
ఈ జాబ్ మేళా ద్వారా 80కి పైగా ప్రముఖ కంపెనీల్లో 700లకు పైగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా, బీఫార్మసీ, ఎంఫార్మసీ, హోటల్ మేనేజ్మెంట్, డ్రైవర్స్, బీఈ, బీటెక్, ఎంటెక్, బీఏ, బీఎస్సీ, బీకామ్, ఎంబీఏ, ఎంసీఏ, పీజీ చేసిన అభ్యర్థులు ఈ జాబ్ మేళాకు హాజరుకావొచ్చని ప్రకటనలో పేర్కొన్నారు. ట్రాన్స్ జెండర్లు, చెవిటి, మూగ, దివ్యాంగులు కూడా ఈ జాబ్ మేళా ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించబడునని ప్రకటనలో పేర్కొన్నారు. ఇతర ఏదైనా సందేహాలుంటే 9030047304 (Only Whatsapp), 7097655912 నంబర్లను సంప్రదించాలని ప్రకటనలో పేర్కొన్నారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల నోటిఫికేషన్ వివరాలు కావలసినవారు క్రింది వాట్స్అప్ గ్రూపులో చేరండి
0 comments:
Post a Comment