ఐబీపీఎస్ క్లర్క్-2022 ప్రిలిమ్స్ (IBPS Clerk 2022) అడ్మిట్ కార్డులను (Admit Cards) విడుదల చేసింది ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్. ప్రిలిమ్స్ పరీక్షలకు అప్లై చేసుకున్న అభ్యర్థులు అడ్మిట్ కార్డును అధికారిక వెబ్‌సైట్ ibps.in ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఐబీపీఎస్ క్లర్క్ ప్రిలిమ్ పరీక్ష.. ఆగస్టు 28, సెప్టెంబర్ 3, సెప్టెంబర్ 4 తేదీల్లో జరగనుంది.
ఐబీపీఎస్ క్లర్క్ అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ విధానం
స్టెప్-1: ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్(ఐబీపీఎస్) అధికారిక వెబ్‌సైట్ ibps.inను సందర్శించాలి.
స్టెప్-2: హోమ్‌పేజీలో CRP-క్లర్క్స్ XII ఆన్‌లైన్ ప్రిలిమినరీ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ లింక్‌పై క్లిక్ చేయండి.
స్టెప్-3: ఆ తరువాత లాగిన్ వివరాలను నమోదు చేస్తే కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
స్టెప్-4: ప్రిలిమ్స్ పరీక్ష కోసం మీ IBPS క్లర్క్ అడ్మిట్ కార్డ్ డిస్‌ప్లే అవుతుంది.
స్టెప్-5: భవిష్యత్తు అవసరాల కోసం కాపీని డౌన్‌లోడ్ చేసి ప్రింట్ తీసుకోండి
ఐబీపీఎస్ క్లర్క్ ప్రిలిమ్స్ అడ్మిట్ కార్డ్- 2022 డౌన్‌లోడ్ లింక్ సెప్టెంబర్ 4, 2022 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. దీంతో అభ్యర్థులు నాలుగో తేదీ తరువాత క్లర్క్ కాల్ లెటర్‌ను యాక్సెస్ చేసుకోలేరు. అడ్మిట్ కార్డ్‌ను ఎగ్జామ్ హాల్‌కు తప్పనిసరిగా తీసుకెళ్లాలి. లేకపోతే పరీక్ష రాయడానికి అనుమతించరు.
వివిధ రకాల ఉద్యోగ నోటిఫికేషన్ కావలసిన వారు ఈ క్రింది వాట్స్ అప్ గ్రూప్లో చేరండి
0 comments:
Post a Comment