ఏపీ సర్కారు నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లీనిక్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్ (MLHP) పోస్టులను అర్హులై అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. మొత్తం 1681 పోస్టులను ఆ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.
గ్రామాల్లో వైద్య సేవలను అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 10,032 విలేజ్ హెల్త్ క్లీనిక్‌లను ఏర్పాటు చేస్తున్నారు. వీటిలో సేవలను అందించేందుకు ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఈ పోస్టులను ఒక సంవత్సరం కాంట్రాక్ట్ విధానంలో నియమించనున్నారు. ఇప్పటి వరకు దీనిలో 8,321 పోస్టుల భర్తీ కూడా పూర్తయింది. మిగిలిన పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా నియమించనున్నారు.
వీటికి దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 9వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. పూర్తి వివరాలకు https://hmfw.ap.gov.in/ లేదా https://cfw.ap.nic.in/ వెబ్ సైట్లను సందర్శించడం ద్వారా తెలుసుకోవచ్చు. అంతే కాకుండా.. ఈ వెబ్ సైట్లలోనే ఆన్ లైన్ విధానంలో దరఖాస్తులను సమర్పించాలి.
రాత పరీక్ష ఆధారంగా ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. రాత పరీక్షకు సంబంధించి హాల్ టికెట్స్ ఈ నెల 24 నుంచి 30వ తేదీ మధ్యలో అందుబాటులో ఉండనున్నాయి. సెప్టెంబర్ మొదటి వారంలోనే ఈ పరీక్షను నిర్వహించనున్నారు.
పరీక్ష ఇలా ఉంటుంది:
బీఎస్సీ నర్సింగ్ సిలబస్ నుంచి 200 ప్రశ్నలకు
మల్టిపుల్ చాయిస్ విధానంలో పరీక్ష ఉంటుంది. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 200 మార్కులకు పరీక్ష ఉంటుంది. పరీక్ష సమయం 180 నిమిషాలు (3 గంటలు) ఉంటుంది.
ఆన్ లైన్ విధానంలో ఈ పరీక్షను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. మొత్తం 200 మార్కులకు ఆబ్జెక్టివ్ విధానంలో ఈ పరీక్ష ఉంటుంది. సమయం మూడు గంటలుగా నిర్ణయించారు.
Important Link:
వివిధ రకాల ఉద్యోగం నోటిఫికేషన్ క్రింది వాట్సాప్ గ్రూప్ లో చేరండి
Job Notifications Telegram Group:
0 comments:
Post a Comment