సాంఘిక సంక్షేమ శాఖ, వై.యస్.ఆర్ జిల్లా, కడప
యస్.సి./ఎస్.టి. బ్యాక్ లాగ్ ఉద్యోగాల ఖాళీల భర్తీ చేయుటకొరకు పత్రికా ప్రకటన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము సాంఘిక సంక్షేమ (సి.వి.ఆర్.ఓ.ఆర్) ఉత్తర్వులు జి.ఓ.ఆర్.టి.నెం. 181, తేది: 02-07-2021 అనుసరించి 2022-23 సంవత్సరానికి వై. యస్. ఆర్ కడప జిల్లా లోని వివిధ ప్రభుత్వ శాఖలలో యస్.సి. యస్.టి బ్యాక్ లాగ్ ఉద్యోగాల ఖాళీలు భర్తీ చేయుటకు వై. యస్. ఆర్ కడప జిల్లాకు చెందిన అర్హులైన షెడ్యుల్డ్ కులములు మరియు షెడ్యుల్డ్ తెగలకు చెందిన అభ్యర్థుల నుండి ఈ క్రింద తెలిపిన వివిధ కేటగిరి పోస్టులకు అనగా వాచ్ మెన్ (01), ఆఫీస్ వాచర్ (02) దరఖాస్తులను ఆన్ లైన్ ద్వారా ఆహ్వానించడమైనది. కావున అర్హులైన అభ్యర్థులు తమ దరఖాస్తులను తేది 08-08-2022 నుండి 22-08-2022 సాయంత్రం 5.00 గంటల లోగా https://kadapa.ap.gov.in వెబ్ సైట్ లోని యస్.సి. ఎన్సీటి బ్యాక్ లాగ్. ఉద్యోగ నియామకములకు సంబందించిన లింక్ క్లిక్ చేసి అన్ని ధ్రువపత్రాలను స్కాన్ చేసి ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకొనవలెను మరియు www.scstbacklogkdp.in ద్వారా కూడా దరఖాస్తు చేసుకొనవచ్చును. 22-08-2022 సాయంత్రం 5.00 గంటల తర్వాత ఎటువంటి దరఖాస్తులు: స్వీకరించబడవు. అభ్యర్ధులు తమ ధ్రువపత్రాలను గజిటెడ్ అధికారితో ద్రువీకరించి గెజిటెడ్ అధికారులతో.. అటెస్ట్ చేయబడిన సర్టిఫికెట్ల హార్డ్ కాపీలు మరియు డౌన్ లోడెడ్ అప్లికేషను తో సహా 27-08-2022 వ తేది 5.00 గంటల లోగా సంబందిత జిల్లా సాంఘికసంక్షేమ శాఖ జిల్లా గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయములో సమర్పించవలెను. ఇతర వివరముల కొరకు సంప్రదించ వలసిన ఫోన్ నంబర్స్ 08562-244473,08562-240750.
Official Website: https://kadapa.ap.gov.in
Complete Notification: Click Here
0 comments:
Post a Comment