ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖకు చెందిన ఏపీ డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలోని అన్ని జిల్లాల్లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో.. 2051 స్టాఫ్ నర్స్, ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-II, ఫార్మసిస్ట్ గ్రేడ్-II, ఎఫ్‌ఎన్‌ఓ, శానిటరీ అటెండర్ కమ్ వాచ్‌మెన్ పోస్టుల..
AP HMFW Staff Nurse Recruitment 2022: ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖకు చెందిన ఏపీ డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలోని అన్ని జిల్లాల్లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో.. 2051 స్టాఫ్ నర్స్, ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-II, ఫార్మసిస్ట్ గ్రేడ్-II, ఎఫ్‌ఎన్‌ఓ, శానిటరీ అటెండర్ కమ్ వాచ్‌మెన్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టును బట్టి పదోతరగతి, డీఎమ్‌ఎల్టీ, డిప్లొమా ఫార్మసీ, ఎం ఫార్మసీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే అభ్యర్ధుల వయసు 42 యేళ్లకు మించకుండా ఉండాలి. దరఖాస్తు రుసుముగా జనరల్ అభ్యర్ధులు రూ.250లు తప్పనిసరిగా చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/బీసీ/వికలాంగ అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో ఆగస్టు 20, 2022వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. అకడమిక్ మెరిట్, అనుభవం ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. ఇతర పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చూడొచ్చు.
జిల్లాలవారీగా ఖాళీల వివరాలు:
అనంతపురం: 171
చిత్తూరు: 162
తూర్పు గోదావరి: 322
గుంటూరు: 132
కృష్ణ: 296
కర్నూలు: 129
ప్రకాశం: 166
SPSR నెల్లూరు: 10
శ్రీకాకుళం: 144
విజయనగరం: 194
పశ్చిమ గోదావరి: 237
వైఎస్ఆర్ కడప: 88
Subscribe My Whatsapp & Telegram Groups
0 comments:
Post a Comment