ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) నుంచి భారీగా బ్యాంకు ఉద్యోగాల (Bank Jobs) భర్తీకి నోటిఫికేషన్లు విడుదల అవుతున్న విషయం తెలిసిందే.ప్రభుత్వ ఉద్యోగాల తర్వాత బ్యాంకు ఉద్యోగాలకు అత్యధికంగా యువత పోటీ పడుతూ ఉంటారు. ఇందుకోసం వేలకు వేలు చెల్లించి కోచింగ్ తీసుకుంటూ ఉంటారు. సామాన్యులకు ఈ మొత్తంలో ఫీజు చెల్లించడం కష్టంతో కూడుకున్న పని. ఇలాంటి అభ్యర్థులకు తెలంగాణ స్టేట్ బీసీ స్టడీ సర్కిల్ (BC Study Circle) శుభవార్త చెప్పింది. వారికి ఫ్రీగా కోచింగ్ అందించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ అలోక్ కుమార్ ప్రకటన విడుదల చేశారు. బ్యాంక్ కోచింగ్ కు ప్రిపేర్ అవుతున్న బీసీ అభ్యర్థులకు ఫ్రీగా కోచింగ్ అందించనున్నట్లు ప్రకటించారు. జిల్లాకు 30 మంది చొప్పున మొత్తం వేయి మందికి ఈ శిక్షణ ఉంటుందని తెలిపారు.
మొత్తం 1000 మంది అభ్యర్థులకు శిక్షణ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఈ శిక్షణలో బీసీలకు 75 శాతం, ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 5 శాతం, EWS, పీహెచ్సీ అభ్యర్థులకు అభ్యర్థులకు 5 శాతం కోటా ఉంటుందని తెలిపారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు https://studycircle.cgg.gov.in/ వెబ్ సైట్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
Join the WhatsApp group below for different types of job notifications
0 comments:
Post a Comment