Indian Army Recruitment 2022: భారత త్రివిధ దళాల్లో ఉన్న దాదాపు 1,35,850 పోస్టులను భర్తీ చేయనున్నట్లు మోదీ సర్కారు ఇటీవల రాజ్యసభకు (Indian Army Recruitment 2022) తెలియజేసింది.మెుత్తం ఖాళీల్లో ఇండియన్ ఆర్మీలో 1,16,464, ఇండియన్ నేవీలో 13,597, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (ఐఏఎఫ్)లో 5789 పోస్టులు ఉన్నట్లు రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్ వెల్లడించారు. ఏ డిపార్ట్ మెంట్లో ఎన్ని పోస్టులు భర్తీ చేయనున్నారో తెలుసుకుందాం.
ఇండియన్ ఆర్మీ:
ఆఫీసర్ పోస్టులు- 7,308
ఎంఎన్ఎస్ ఆఫీసర్లు - 471
జూనియర్ కమీషన్డ్ ఆఫీసర్లు- 1,08,685
ఇండియన్ నేవీ:
ఆఫీసర్ పోస్టులు (మెడికల్, డెంటల్ మినహా)- 1446
సెయిలర్ల పోస్టులు- 12151
ఇండియన్ ఎయిర్ ఫోర్స్:
ఆఫీసర్ల పోస్టులు- 572
ఎయిర్‌మెన్ పోస్టులు- 5217
అగ్నిపథ్ స్కీమ్
ఇటీవల కేంద్రం 'అగ్నిపథ్' పేరిట కొత్త రిక్రూట్ మెంట్ స్కీమ్ ప్రకటించిన విషయం తెలిసిందే. త్రివిధ దళాలు కింద ఈ ఏడాది 46 వేల మంది అగ్నివీరులను నియమించుకోనున్నారు. ఇప్పటికే రిక్రూట్ మెంట్ ప్రక్రియ ప్రారంభమైంది. అయితే ఈ పథకానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే.
వివిద రకాల ఉద్యోగ నోటిఫికేషన్లు కావలసిన వారు వాట్స్అప్ గ్రూప్ లో చేరండి
0 comments:
Post a Comment