రాష్ట్రంలోని రాజీవ్ గాంధీ వైజ్ఞానిక, సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ, శ్రీకాకుళం, ఒంగోలు ట్రిపుల్ ఐటీల్లో పీ యూసీల్లో ప్రథమ సంవత్సరం ప్రవేశాలకుగాను ఆగస్టు మొ దటి వారంలో నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు ఆర్జీయూకేటీ చా స్టార్ ఆచార్య కేసీ రెడ్డి గురువారం తెలిపారు. పదో తరగతి సప్లిమెం టరీ పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారిని కూడా ప్రభుత్వం రెగ్యులర్ విద్యార్థులుగానే పరిగణిస్తున్నందున జూలై నెలాఖరుకు పదో తరగతి పరీక్షల ఫలితాలు వస్తాయని, ఆ తర్వాత ఆగస్టు తొలి వారంలో అడ్మిషన్ల నో టిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పారు. ఆగస్టు నెలాఖరుకల్లా అడ్మిషన్ల ప్రక్రియను పూర్తి చే స్తామన్నారు. 4 ట్రిపులఐటీల్లో ఒక్కొక్క దానిలో 1,100 సీట్ల చొప్పున మొత్తం 4,400 సీట్లు ఉన్నాయన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు డిప్రవేషన్ స్కోర్ను ఇవ్వడం జరుగుతుందన్నారు. కాగా, జూలై 8న ఇడుపులపా య ట్రిపుల్ ఐటీలో గవర్నింగ్ కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహి స్తున్నట్లు ఆచార్య కేసీ రెడ్డి చెప్పారు. ఆర్జీయూకేటీ వైస్ చాన్స్ లర్ పదవిని భర్తీ చేయడానికి నోటిఫికేషన్ ఇచ్చామని, త్వర లోనే రెగ్యులర్ వైస్ చాన్స్లర్ను నియమిస్తామని తెలిపారు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment