ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) నుంచి ఇటీవల వరుసగా జాబ్ మేళాలకు (Job Mela) సంబంధించిన ప్రకటనలు విడుదలవుతున్న విషయం తెలిసిందే.తాజాగా ప్రముఖ కియా మోటార్స్ (KIA Motors) తో పాటు మరో రెండు సంస్థల్లో ఖాళీల భర్తీకి ప్రకటన విడుదల చేశారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులకు ఈ నెల 22న ఉదయం 10 గంటలకు పెనుగొండలో జాబ్ మేళాను నిర్వహించనున్నారు.
ఖాళీలు, విద్యార్హతల వివరాలు:
KIA Motors: ఈ సంస్థలో 50 ఖాళీలు ఉన్నాయి. డిగ్రీ, డిప్లొమా, బీటెక్ చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.13 వేల నుంచి రూ.14 వేల వరకు వేతనం చెల్లించనున్నారు. ఎంపికైన అభ్యర్థులు పెనుగొండలో పని చేయాల్సి ఉంటుంది. అభ్యర్థుల వయస్సు 18-28 ఏళ్లు ఉండాలి. అయితే.. కేవలం పురుషులు మాత్రమే ఈ ఖాళీలకు అప్లై చేసుకోవాలని ప్రకటనలో స్పష్టం చేశారు.
Seoyon E-Hwa Summit: ఈ విభాగంలో 100 ఖాళీలు ఉన్నాయి. డిప్లొమా/బీటెక్ చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.14 వేల వేతనం చెల్లించనున్నారు. ఎంపికైన అభ్యర్థులు పెనుగొండలో పని చేయాల్సి ఉంటుంది. అయితే.. కేవలం పురుషులు మాత్రమే ఈ ఖాళీలకు అప్లై చేయాలని ప్రకటనలో స్పష్టం చేశారు.
Vinuthna Fertilizers: ఈ సంస్థలో 40 ఖాళీలు ఉన్నాయి. టెన్త్, ఇంటర్, డిగ్రీ చేసిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.8 వేల నుంచి రూ.12 వేల వరకు వేతనం చెల్లించనున్నారు. ఎంపికైన వారు శ్రీ సత్యసాయి జిల్లాలో పని చేయాల్సి ఉంటుంది. వయస్సు 18-30 ఏళ్లు ఉండాలి. అయితే.. ఈ సంస్థలోని ఖాళీలకు సైతం కేవలం పురుషులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని ప్రకటనలో స్పష్టం చేశారు.
Subscribe My Whatsapp & Telegram Groups
0 comments:
Post a Comment