త్వరలో 8 వేల పోస్టుల భర్తీకి ఆదేశం జాబ్ క్యాలెండర్ సమీక్ష లో ఆదేశం

జాబ్‌ కేలండర్‌లో నిర్దేశించుకున్న పోస్టుల్లో మిగిలిఉను 8 వేల పోస్టులను సాధ్యమైనంత త్వరగా భర్తీ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అధికారులను ఆదేశించారుజాబ్‌ కేలండర్‌పై క్యాంపు కార్యాలయంలో శుక్రవారం సిఎం సమీక్ష నిర్వహించారు. 2021-22 సంవత్సరంలో 39,654 పోస్టులను భర్తీ చేశామని సిఎం అన్నారు. వైద్య ఆరోగ్యశాఖలో మిగిలిన పోస్టులను ఈ నెలాఖరులోగా, ఉన్నత విద్యాశాఖలోని అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పోస్టులను సెప్టెంబర్‌ లోపు, ఎపిపిఎస్‌సి పోస్టులను మార్చిలోగా భర్తీ చేయాలని సిఎం ఆదేశించారు. విద్య, వైద్యంపై చాలా డబ్బు వెచ్చించి ఆస్పత్రులు, విద్యాలయాలు కడుతున్నామని చెప్పారు.

ఇక్కడ ఖాళీలు భర్తీచేయకపోతే వాటి ప్రయోజనాలు ప్రజలకు అందవని తెలిపారు. ఉనుత విద్యలో టీచింగ్‌ పోస్టుల భర్తీలో పారదర్శకత, సమర్థతకు పెద్దపీట వేసేలా నిర్ణయాలు ఉండాలని స్పష్టం చేశారు. రెగ్యులర్‌, కాంట్రాక్ట్‌ అయినా నియామకాలు పారదర్శకంగా జరపాలని ఆదేశించారు. ఇందుకోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని చెప్పారు.

పోలీస్‌ ఉద్యోగాల భర్తీపైన కూడా యాక్షన్‌ప్లాన్‌ రూపొందించుకోవాలని ఆదేశించారు. పోలీస్‌ విభాగం, ఆర్థిక శాఖ అధికారులు కూర్చొని వీలైనంత త్వరగా యాక్షన్‌ ప్లాన్‌ రూపొందించుకోవాలని ఆదేశించారు. వచ్చే నెల మొదటివారంలో తనకు నివేదించాలని చెప్పారు. కార్యాచరణ ప్రకారం క్రమం తప్పకుండా పోలీస్‌ ఉద్యోగాలు భర్తీ చేయాలని ఆదేశించారు . ఈ సమావేశంలో డిజిపి కెవి రాజేంద్రనాథ్‌ రెడ్డి, ఉన్నతాధికారులు ఎస్‌ఎస్‌ రావత్‌, ఏఆర్‌ అనురాధ, శశిభూషణ్‌ కుమార్‌, ముద్దాడ రవిచంద్ర, సాంఘిక సంక్షేమ, జిఎడి కార్యదర్శులు ఎంఎం నాయక్‌, హెచ్‌ అరుణ్‌ కుమార్‌, కళాశాల విద్య కమిషనర్‌ పోలా భాస్కర్‌, ఉనుత విద్యామండలి చైర్మన్‌ కె హేమచంద్రారెడ్డి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/EuEa9tQSyqWD4rSLQ2D6lJ
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top