పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ (TSSPDCL) నుంచి జాబ్ నోటిఫికేన్ విడుదల

తెలంగాణలో కొలువుల జాతర మొదలైన విషయం తెలిసిందే. ఇప్పటికే తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి 503 గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే ఇప్పటికే తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) నుంచి 503 గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ (Job Notifications) విడుదలైన విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ప్రస్తుతం సాగుతోంది. 17 వేలకు పైగా పోలీస్ ఉద్యోగాల భర్తీకి సైతం తెలంగాణ స్టేట్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ నోటిఫికేషన్ (TSLPRB) విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు సైతం ప్రస్తుతం దరఖాస్తు ప్రక్రియ నిర్వహిస్తున్నారు. ఈ నెలాఖరులో గ్రూప్ 4 ఉద్యోగాల భర్తీకి సైతం నోటిఫికేషన్ విడుదల చేసేందుకు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సిద్ధమవుతోంది. ఇదిలా ఉంటే.. తాజాగా తెలంగాణ విద్యుత్ శాఖ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. భారీగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది.

ఈ మేరకు సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ (TSSPDCL) నుంచి జాబ్ నోటిఫికేన్ విడుదలైంది. మొత్తం 1271 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. అసిస్టెంట్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్), సబ్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్), జూనియర్ లైన్ మెన్ విభాగంలో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. సంబంధింత విభాగాల్లో ఐటీఐ, బీటెక్, బీఈ విద్యార్హత కలిగిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి..

పోస్టు ఖాళీలు
అసిస్టెంట్ ఇంజనీర్/ఎలక్ట్రికల్ 70
సబ్ ఇంజనీర్/ఎలక్ట్రికల్ 201
జూనియర్ లైన్ మెన్ 1000
మొత్తం: 1271

ఈ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ ఈ నెల 11న అంటే బుధవారం విడుదల కానుంది. అదే రోజు నుంచి దరఖాస్తుల ప్రక్రియను సైతం ప్రారంభించనున్నారు. అభ్యర్థులు ఇతర పూర్తి వివరాలకు https://tssouthernpower.cgg.gov.in/ వెబ్ సైట్ ను సందర్శించాలని ప్రకటనలో పేర్కొన్నారు.
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top