ప్రభుత్వ ఉద్యోగుల కోసం చూస్తున్న నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (FCI) ఉద్యోగ నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 4710 పోస్టులను భర్తీ చేయనుంది.
గ్రూప్-2,3,4 కేటగిరీల్లో ఈ ఖాళీలు ఊన్నాయి. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ పోస్టులకు సంబంధించిన పూర్తి స్థాయి నోటిఫికేషన్ ఇంకా విడుదల కాలేదు. షార్ట్ నోటీస్ మాత్రమే వెలువడింది. త్వరలో పూర్తిస్థాయి నోటిఫికేషన్ విడుదల కానుంది.
మొత్తం ఖాళీ పోస్టుల సంఖ్య: 4710
కేటగిరీ 2లో 35 పోస్టులు, కేటగిరీ 3 - 2521 పోస్టులు , కేటగిరీ 4 (వాచ్‌మెన్) - 2154 పోస్టులు కేటాయించారు.
విద్యార్హతలు: పోస్టులను బట్టి 8వ తరగతి, 10వ తరగతి, గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారు అర్హులు.
ఎంపిక విధానం: రాతపరీక్ష, ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేస్తారు.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్:https://fci.gov.in/ చూడండి.
0 comments:
Post a Comment