ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) నుంచి మరో జాబ్ మేళా (Job Mela) కు సంబంధించి అధికారులు తాజాగా ప్రకటన విడుదల చేశారు.ప్రముఖ MiRACLE SOFTWARE SYSTEMS సంస్థలో ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటలో పేర్కొన్నారు. ఏదైనా డిగ్రీ, పీజీ చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు (Jobs) అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులు రుషికొండ (విశాఖపట్నం), భోగాపురం (విజయనగరం)లో పని చేయాల్సి ఉంటుంది.
ఖాళీలు, విద్యార్హతల వివరాలు:
ఈ ప్రకటన ద్వారా మొత్తం 150 ఖాళీలను భర్తీ చేయనున్నారు. డిగ్రీ, పీజీ చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవాల్సి ఉంటుందని ప్రకటనలో స్పష్టం చేశారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.1.8 లక్షల నుంచి రూ.3.6 లక్షల వరకు చెల్లించనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. పురుషులు/స్త్రీలు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. వయస్సు 18-25 ఏళ్లు ఉండాలి. ఎంపికైన అభ్యర్థులు Software Trainee, US IT Business Development Executive, IT Recruiter, HR Executives గా పని చేయాల్సి ఉంటుంది.
0 comments:
Post a Comment