ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన ఏపీ వైద్య విధాన పరిషత్ (Andhra Pradesh Vaidya Vidhana Parishad)లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ (Notification) విడుదల అయ్యింది.ఈ నోటిఫికేషన్ ద్వారా తూర్పు గోదావరి జిల్లాలో ఏపీవీవీపీ కార్యాలయంలో కాంట్రాక్/ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదిన ఉద్యోగులను నియమిస్తారు. ఫార్మసిస్ట్‌లు, ల్యాబ్ టెక్నిషియన్‌లు, రెడియోగ్రాఫర్‌లు థియేటర్ అసిస్టెంట్ తదితర పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆఫ్‌లైన్ పద్ధతిలో ఉంటుంది. నోటిఫికేషన్, అప్లికేషన్ ప్రాసెస్ కోసం అధికారిక వెబ్‌సైట్ https://eastgodavari.ap.gov.in/ ను సందర్శించాల్సి ఉంటుంది. దరఖాస్తుకు జూన్ 2, 2022 వరకు అవకాశం ఉంది.
పోస్టుల వివరాలు..
పోస్టుపేరు ఖాళీలు వేతనం
ఫార్మసిస్ట్‌లు 04 రూ.32,670/-
ల్యాబ్ టెక్నిషియన్‌లు 06 రూ.32,670/-
రెడియోగ్రాఫర్‌లు 01 రూ.21,500/-
థియేటర్ అసిస్టెంట్ 09 రూ.15,000
ల్యాబ్ అటెండెంట్లు 01 రూ.15,000
జూనియర్ అసిస్టెంట్ 01 రూ.18,500
ఆఫీస్ సబార్డినెట్ 01 రూ.15,000
పోస్టుమార్టం అసిస్టెట్ 18 రూ.15,000
జనరల్ డ్యూటీ అటెండెట్ 16 రూ.15,000
ఎంపిక విధానం..
- అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు.
- మెరిట్ ఆధారంగా, రిజర్వేషన్ ప్రక్రియను అనుసరించి తుది ఎంపిక ఉంటుంది.
ముఖ్యమైన సమాచారం..
- ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి వయసు 18 ఏళ్ల నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి
- పోస్టుల ఆధారంగా పదోతరగతి నుంచి డిగ్రీ అర్హతతో ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
దరఖాస్తు విధానం..
Step 1 - దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆఫ్‌లైన్ పద్ధతిలో ఉంటుంది.
Step 2- ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://eastgodavari.ap.gov.in/ లో Notices లో రిక్రూట్‌మెంట్ ఆప్షన్‌లోకి వెళ్లాయి.
Step 3 నోటిఫికేషన్‌ను పూర్తిగా చదవాలి.
Step 4 నోటిఫికేషన్ చివరల అప్లికేషన్ ఫాంను ప్రింట్ తీసుకోవాలి.
Step 5 - తప్పులు లేకుండా దరఖాస్తులను నింపాలి.
Step 6- అవరసరమైన డాక్యుమెంట్లను దరఖాస్తు ద్వారా పంపాలి.
Step 7 - అభ్యర్థులకు దరఖాస్తు రుసుం రూ.500 ఉంటుంది, ఎస్సీ, ఎస్టీ,బీసీ అభ్యర్థులకు రూ.300 ఉంటుంది. ఫిజికల్ చాలెంచెండ్ పర్సన్‌కు దరఖాస్తు రుసుం ఉండదు.
Step8 - అనంతరం దరఖాస్తును
డిస్ట్రిక్ట్ కో ఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్, ఏపీవీవీపీ, రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రి.
- దరఖాస్తుకు చివరి తేదీ జూన్ 2, 2022 వరకు అవకాశం ఉంది.
0 comments:
Post a Comment