దేశీయ చమురు సరఫరా సంస్థ అయిన హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) టెక్నీషియన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది.ఆసక్తి కలిగిన వారు వచ్చే నెల 21 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం 186 ఖాళీలను భర్తీకి నియామక ప్రక్రియ ప్రారంభించింది. రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తున్నది.
మొత్తం ఖాళీలు: 186
ఇందులో ఆపరేషన్స్ టెక్నీషియన్ 94, బాయిలర్ టెక్నీషియన్ 18, మెయింటెనెన్స్ టెక్నీషియన్ 40, జూనియర్ ఫైర్ అండ్ సేఫ్టీ ఇన్‌స్ట్రక్టర్ 18, ల్యాబ్ అసిస్టెంట్ 16 చొప్పున పోస్టులు ఉన్నాయి.
అర్హతలు: సంబంధిత విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఏప్రిల్ 1 నాటికి 18 నుంచి 25 ఏండ్ల లోపు వయస్సు కలిగి ఉండాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష
దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌లో
అప్లికేషన్ ఫీజు: రూ.590, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.
దరఖాస్తులు ప్రారంభం: ఏప్రిల్ 22
దరఖాస్తులకు చివరితేదీ: మే 21
వెబ్‌సైట్: www.hindustanpetroleum.com
0 comments:
Post a Comment